IND vs NZ 3rd T20 Live Streaming: భారత్, న్యూజిలాండ్ మూడో టీ20.. ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
India vs New Zealand 3rd T20I Live Streaming details. మంగళవారం భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది.
India vs New Zealand 3rd T20I Live Streaming and Playing 11 details: టీ20 ప్రపంచకప్ 2022 అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో గెలిచి.. 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌లోని తొలి టీ20 వర్షంతో తుడిచిపెట్టుకుపోన విషయం తెలిసిందే. ఇక చివరి మ్యాచ్ ఇరు జట్ల మధ్య మంగళవారం జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. గెలిచి సిరీస్ సమం చేయాలని కివీస్ చూస్తోంది.
నవంబర్ 22న (మంగళవారం) భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 టాస్ పడనుండగా.. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా చూడవచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో మూడవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ని చూడవచ్చు.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.
టీ20 సిరీస్ భారత్ పూర్తి జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ సింగ్, పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: పక్షుల మాదిరే.. కింగ్ కోబ్రా కూడా గూడు కట్టుకుంటుంది! నమ్ముకుంటే ఈ వీడియో చూడండి
Also Read: Suryakumar Yadav: క్రికెట్ మాత్రమే కాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు అవంటే చాలా ఇష్టమట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook