Suryakumar Yadav Cars Collection: క్రికెట్ మాత్రమే కాదు.. సూర్యకుమార్‌ యాదవ్‌కు అవంటే చాలా ఇష్టమట!

India Batter Suryakumar Yadav Cars Collection. సూర్యకుమార్‌ యాదవ్‌కు క్రికెట్ మాత్రమే కాదు ఖరీదైన వాహనాలు అన్నా మక్కువ ఎక్కువట. సూర్య గ్యారేజీలో ఖరీదైన వాహనాలు ఉన్నాయట.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 21, 2022, 07:17 PM IST
  • క్రికెట్ మాత్రమే కాదు.
  • సూర్యకుమార్‌కు అవంటే చాలా ఇష్టమట
  • 25 బంతుల్లో 61 పరుగులు
Suryakumar Yadav Cars Collection: క్రికెట్ మాత్రమే కాదు.. సూర్యకుమార్‌ యాదవ్‌కు అవంటే చాలా ఇష్టమట!

Suryakumar Yadav Cars Collection: భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. సూపర్ 12 దశలో జింబాబ్వేపై 25 బంతుల్లో 61 పరుగులు చేసిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు చేశాడు. సూపర్ 12 దశలో సూర్య ఆడిన 5 మ్యాచుల్లో 225 పరుగులు చేశాడు. కీలక సెమీస్ మ్యాచులో కాస్త నిరాశపరిచినా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సత్తాచాటాడు. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో (111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులు) చెలరేగాడు.

అద్భుతంగా ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇస్తామని సూర్య చాలాసార్లు చెప్పాడు. సూర్యకు క్రికెట్ మాత్రమే కాదు ఖరీదైన వాహనాలు అన్నా మక్కువ ఎక్కువట. సూర్య గ్యారేజీలో ఖరీదైన వాహనాలు ఉన్నాయట. సూర్యకుమార్‌ గ్యారేజీలో మెర్సిడెస్-బెంజ్ జిల్ఈ కూపే, బీఎండబ్ల్యూ, ఆడి మరియు రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. సూర్య గ్యారేజీలో ఉన్న కార్లు ఏవో ఓసారి తెలుసుకుందాం.

Mercedes-Benz GLE Coupe:
ఈ మెర్సిడెస్ కారు ధర రూ. 91.49 లక్షల నుంచి మొదలై రూ. 1.20 కోట్ల వరకు ఉంటుంది. GLE కూపే 3.0L పెట్రోల్ ఇంజిన్‌, 429 bhp శక్తిని మరియు 520 Nm టార్క్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో ఆటోమేటిక్ గేర్ కూడా ఉంటుంది. 

BMW 5 Series 530D M Sport:
బీఎండబ్ల్యూ 5 సిరీస్ 530d M స్పోర్ట్ మోడల్ ధర రూ. 74.49 లక్షలు. ఈ కారు లీటరుకు 17.4 కిమీ మైలేజీ ఇస్తుంది. ఈ కారు 4000 rpmతో 261 bhp శక్తితో నడుస్తుంది. ఈ కారు కార్బన్ బ్లాక్, మెటాలిక్ మరియు వైట్ రంగులలో లభిస్తుంది.

Audi A6:
ఆడి A6 పెట్రోల్ (BS-VI) ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.  ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.84 లక్షల నుంచి రూ. 65.81 లక్షల మధ్య ఉంటుంది.

Land Rover Range Rover Velar:
రేంజ్ రోవర్ వెలార్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో ఉంటుంది. D200 ట్రిమ్ తదుపరి తరం 4-సిలిండర్ ఇంజెనియం డీజిల్ ఇంజన్‌ను పొందుతుంది. రెండు ఇంజన్లు ఆల్-వీల్ డ్రైవ్‌ట్రెయిన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 90 లక్షలు.

Nissan Jonga:
ఈ కారు 3956 cc డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారు 250 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ కారు ఖరీదు రూ. 15 లక్షలు.

Also Read: పక్షుల మాదిరే.. కింగ్ కోబ్రా కూడా గూడు కట్టుకుంటుంది! నమ్ముకుంటే ఈ వీడియో చూడండి

Also Read: కోహ్లీతో బ్యాటింగ్ చేయడం పెద్ద సమస్య.. మీడియాతో సూర్యకుమార్‌ ఏం చెప్పాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News