IND Vs NZ World Cup 2023: టాస్ గెలిచిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి..!
India Vs New Zealand World Cup 2023 Updates Toss and Playing 11: ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. హార్థిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ జట్టులోకి వచ్చారు.
India Vs New Zealand World Cup 2023 Updates Toss and Playing 11: వరల్డ్ కప్‌లో మరో బిగ్‌ఫైట్ ఆరంభమైంది. ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభమైంది. విశ్వకప్‌లో చెరో నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన భారత్, కివీస్.. ఈ పోరులో అమీతుమి తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా.. టీమిండియాలో రెండోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు మరింత చేరువ అవ్వాలని చూస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా గాయం కారణంగా ఇప్పటికే దూరమవ్వగా.. శార్ధుల్ ఠాకూర్‌ను కూడా ఈ మ్యాచ్‌కు పక్కనబెట్టారు. వీరిద్దరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్ చివరి మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే ఆడనుంది.
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇందుకు ప్రత్యేకం కారణం లేదు. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా మంచు కురిసినట్లు అనిపించింది. మంచి పిచ్‌లాగా ఉంది. మేము ఛేజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నాం. వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. గతంలో ఏమి జరిగిందో మర్చిపోవాలి. ప్రతి ఒక్కరూ వచ్చి ఆడాలనుకునే ప్రదేశం ఇది. హార్థిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ, సూర్య కుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు." అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
"మేము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. మంచి పిచ్ కనిపిస్తుంది.మంచు లోపలికి వస్తుందని మాకు తెలుసు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఏది చేసినా.. పర్ఫెక్ట్‌గా చేయాలి. మనం వేగాన్ని కొనసాగించాలి. మేము కొత్త మైదానంలో, కొత్త పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పరిస్థితులకు సర్దుబాటు చేయాలి. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నాం.." అని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.