Team India take 332 run lead after Ajaz Patel's 10-wicket haul: ముంబై వేదికగా న్యూజిల్యాండ్‌తో జరుగుతన్న రెండో టెస్టు రెండో రోజు భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లీసేన సత్తాచాటింది. ఆట ముగిసేసమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (38), చేతేశ్వర్ పుజారా (29) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. అజాజ్ పటేల్ 10 వికెట్లతో చెలరేగడంతో ఈరోజు టీమిండియా 325 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆపై రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin), మొహ్మద్ సిరాజ్ (M Siraj) దెబ్బకు కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

221/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజైన శనివారం ఆట ప్రారంభించిన టీమిండియా మరో 104 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌ నుంచే అజాజ్‌ పటేల్ (Ajaz Patel) వికెట్ల వేట ఆరంభించాడు. వృద్ధిమాన్ సాహా (27; 62 బంతుల్లో 3x4, 1x6), రవిచంద్రన్‌ అశ్విన్‌ (0)లను వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. మయాంక్‌ అగర్వాల్ (150; 311 బంతుల్లో 17x4, 4x6)తో కలిసి ఏడో వికెట్‌కు 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆచితూచి ఆడిన మయాంక్‌ 150 పరుగులు పూర్తి చేసిన మరుసటి బంతికే అజాజ్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 325 పరుగులకు ఆలౌటైంది.


Also Read: Akhanda : అఖండ సినిమా ఎద్దులకు ఓ రేంజ్‌లో ట్రైనింగ్..బోయపాటికి తెగ నచ్చేశాయట


టీమిండియా బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 62 పరుగులకే ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్‌ (4/8), మహమ్మద్‌ సిరాజ్‌ (3/19), అక్షర్ పటేల్ (2/14) దెబ్బకు కివీస్‌ కుదేలైంది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో కైల్ జేమీసన్‌ (17) చేసిన స్కోరే అత్యధికం కావడం విశేషం. స్టార్ ప్లేయర్స్ టామ్‌ లాథమ్‌ (10), విల్‌ యంగ్‌ (4), రాస్‌ టేలర్‌ (1), హెన్రీ నికోల్స్ (7), టామ్‌ బ్లండెల్‌ (8), రచిన్‌ రవీంద్ర (4) పూర్తిగా విఫలమయ్యారు. కివీస్‌ బ్యాటర్లలో ఇద్దరు మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం గమనార్హం. కికెవిఎస్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవ్వడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేనకు 263 పరుగులు ఆధిక్యం దక్కింది. 


Also Read: Deepika Padukone : దీపిక, అనన్య రొమాన్స్‌లో రెచ్చిపోయారట.. అందుకే ఓటీటీలో రిలీజ్‌


న్యూజిల్యాండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అందుకు ఇష్టపడలేదు. దాంతో టీమిండియానే  బరిలోకి దిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా ఓపెనర్‌ శుభ్‌మాన్ గిల్‌ (Gill) గాయపడడంతో అతడి స్థానంలో చేతేశ్వర్ పుజారా (Pujara) బరిలోకి దిగాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి పుజారా పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి వికెట్‌కి 69 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం భారత్ 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు నిదానంగా ఆడినా కివీస్ ముందు భారీ టార్గెట్ ఉంచే అవకాశం ఉంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook