India vs New Zealand 1st ODI Match Tickets Released on Paytm Today: ఉప్పల్‌ స్టేడియం త్వరలోనే భారత్, న్యూజీల్యాండ్ మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2023 జనవరి 18న ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా హెచ్‌సీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి టికెట్లను ఆఫ్‌ లైన్‌లో కాకుండా.. ఆన్‌ లైన్‌లో ఉంచారు. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉప్పల్‌ స్టేడియం కెపాసిటీ 39112. అందులో 9695 కాంప్లిమెంటరీ పాసెస్ ఉంటాయి. మిగతా 29417 టికెట్స్ ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచుతారు. జనవరి 13 నుంచి 16 వరకు భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టికెట్స్ ఆన్‌లైన్‌లో విడతల వారీగా విడుదల చేయనున్నారు. నేటి టికెట్స్ ఇప్పటికే పేటీఎం ఇన్‌సైడర్ సైట్‌లో రిలీజ్ చేశారు. నేడు 6 వేల టికెట్స్ విడుదల కాగా.. జనవరి 14న 7 వేలు, జనవరి 15న 7 వేలు, జనవరి 16న మిగతా టికెట్లను అమ్మకానికి ఉంచుతారు. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకునేవారు కేవలం 4 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు . 


ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో జనవరి 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్‌ టికెట్లు తీసుకోవాలని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతోంది. గత టీ20కి జిమ్‌ఖానాలో ఆఫ్‌ లైన్‌లో టికెట్లు అమ్మడం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. చిన్న పిల్లలు కూడా గాయాలపాలయ్యారు. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. ఆన్‌ లైన్‌లోనే టికెట్లన్నింటినీ విక్రయానికి పెట్టారు.


2023 జనవరి 14న న్యూజిలాండ్‌ జట్టు హైదరాబాద్ వచ్చి.. 15న ప్రాక్టీసు చేస్తుంది. మరోవైపు భారత జట్టు జనవరి 16న హైదరాబాద్‌ చేరుకుంటుంది. 17న ఇరు జట్లు కలిసి ప్రాక్టీస్‌ చేస్తాయి. జనవరి 18న మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. 21న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, 24న ఇండోర్‌లో మూడో వన్డే జరుగుతుంది. జనవరి 27న రాంచీలో తొలి టీ20, 29న లక్నోలో రెండో టీ20, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 1న మూడో టీ20 జరగనుంది.  


Also Read: Kuldeep Yadav: తుది జట్టు కూర్పు చాలా ముఖ్యం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కుల్దీప్ యాదవ్ 


Also Read: రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని ఎంఎస్ ధోనీ అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు.. అసలు విషయం చెప్పేసిన మాజీ కోచ్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.