India vs Pakistan Asia Cup 2022,  Virat Kohli about MS Dhoni: మూడు నెలల వ్యవధిలో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతలకు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడం ఈ ఏడాది ఆరంభంలో పెద్ద సంచలంగా మారిన విషయం తెలిసిందే. ముందుగా టీ20 కెప్టెన్సీకి విరాట్  వీడ్కోలు పలకగా.. ఆపై వన్డే కెప్టెన్సీ నుంచి మాత్రం బీసీసీఐ తప్పించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఓకే కెప్టెన్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ చెప్పింది. ఇక టెస్ట్ ఫార్మాట్ నుంచి కోహ్లీ స్వయంగా తప్పుకున్నాడు. దాంతో మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. అయితే టెస్టు కెప్టెన్సీ వదిలేసినపుడు తనకు కేవలం ఒకే ఒక వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చిందని విరాట్ చెప్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్‌ 2022లో భాగంగా భారత్‌, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచులో భారత్ ఓడిపోయినా.. విరాట్ కోహ్లీ (60; 44 బంతుల్లో 4×4, 1×6 హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఉన్న అనుబంధం ఎంత బలమైందో మరోసారి చెప్పాడు. తాను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ నుంచి మాత్రమే మెసేజ్‌ వచ్చిందన్నాడు. టీవీల ఎదుట కూర్చొని, ప్రపంచం మొత్తానికి తెలిసేలా సలహాలు ఇస్తే అస్సలు పట్టించుకోనన్నాడు. టీవీలలో కూర్చుని చెత్తవాగుడు వాగకండని ఫైర్ అయ్యాడు. 


'నేను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు.. నేను గతంలో ఆడిన ఒక వ్యక్తి నుంచి మాత్రమే మెసేజ్‌ వచ్చింది. ఆయన మరెవరో కాదు.. ఎంఎస్ ధోనీ. నా ఫోన్‌నంబర్‌ చాలా మంది వద్ద ఉంది. చాలా మంది నాకు టీవీల్లో సలహాలు ఇస్తున్నారు. కానీ మహీ ఒక్కడే వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడు. ఎవరితోనైనా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. ఇరువైపుల నుంచి నమ్మకముందన్న విషయం అర్థమవుతుంది. నేను ధోనీ నుంచి ఏమీ ఆశించలేదు.. నా నుంచి కూడా అతడు ఏమీ ఆశించలేదు' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.


'నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా చెబుతాను. మీరు టీవీలలో మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి తెలిసేట్లు నాకు సలహాలు ఇస్తున్నారు. అయితే వాటికి నా వద్ద ఎలాంటి విలువ ఉండదు. మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. వాటిని నేను నిజాయితీగా పరిశీలిస్తా. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మీరు విజయం సాధించేలా ఆ భగవంతుడే చూస్తాడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఇతరుల పట్ల ఎలా మసలుకోవాలో మన ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 


Also Read: రాత్రంతా సీలింగ్ ఫ్యాన్‌నే చూశా.. అర్ష్‌దీప్ సింగ్‌ మిసింగ్ క్యాచ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?


Also Read: ప్రాణదాతలను సత్కరించిన గవర్నర్ తమిళిసై, చిరంజీవి.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్డు పంపిణీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook