India played with 12 players says Pakistan Former Coach Mickey Arthur: ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆదివారం (ఆగష్టు 28) దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో స్టార్ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో 148 రన్స్ చేసి విజయం సాధించింది. దాంతో టీ20 ప్రపంచకప్‌ 2021లో ఎదురైనా పరాభవానికి బదులు తీర్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచులో హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బంతితో (3/25) కీలకమైన సమయంలో వికెట్లు తీసి పాక్ నడ్డివిరిచాడు. ఆపై బ్యాటింగ్‌లో (33 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌.. రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి టీమిండియాను విజయంవైపు నడిపించాడు. జడేజా ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి నిష్క్రమించినా.. నాలుగో బంతికి సిక్స్ బాది భారత జట్టుకు అద్భుత విజయం అందించాడు. 


జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్‌ మాజీ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ మిక్కీ ఆర్థర్‌ కూడా పాండ్యాను ఆకాశానికి ఎత్తేశారు. పాండ్యా ఆట తనకు జాక్వెస్‌ కలిస్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో ఆర్థర్‌ మాట్లాడుతూ... 'భారత్‌ 12 మంది ఆటగాళ్లతో ఆడినట్లు అనిపించింది. హార్దిక్ అద్భుత ఆటగాడు. జాక్వెస్‌ కలిస్‌ను గుర్తుకుతెచ్చాడు. అంతేకాదు నేను దక్షిణాఫ్రికాకు ఆడిన రోజుల్లోకి తీసుకెళ్లాడు. నలుగురు సీమర్లలో ఒకడిగా, టాప్‌-5లో బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్న క్రికెటర్‌ భారత్ జట్టు సొంతం. అది ఓ అదనపు ఆటగాడిని ఆడించిన దానితో సమానం' అని అన్నారు. 


'ఐపీఎల్ లీగ్‌లోనూ హార్దిక్‌ పాండ్యా నాయకత్వం బాగుంది. ఒత్తిడి సమయంలోనూ అద్భుతంగా జట్టును ముందుకు నడిపించాడు. బౌలర్లను చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడి కూల్ కెప్టెన్సీ అమోఘం. హార్దిక్ ఓ అద్భుత క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు' అని పాక్‌ మాజీ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ పేర్కొన్నారు. 2019లో వెన్ను గాయం కారణంగా చాలా నెలలు జట్టుకు దూరమైన హార్దిక్.. ఫిట్‌నెస్‌ కోసం చాలా శ్రమించాడు. ఐపీఎల్ 2022 ముందు మైదానంలోకి అడుగుపెట్టిన హార్దిక్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 


Also Read: Shraddha Das Pics: శ్రద్ధా దాస్ హాట్ ట్రీట్.. కుర్రకారు మతులు పోవాల్సిందే!


Also Read: సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా జల్సా రీ రిలీజ్ ట్రైలర్.. మహేష్ వాయిస్ ఓవర్ తో రచ్చ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి