IND vs PAK: ప్రపంచకప్‌లు వస్తుంటాయి పోతుంటాయి.. అతడు మరోసారి గాయపడితే కెరీర్‌కే ప్రమాదం: సల్మాన్
IND vs PAK: Salman Butt warns not to play unfit Shaheen Afridi. పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టీ20 ప్రపంచకప్ 2022లో ఆడించాలని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సూచించాడు.
Salman Butt warns not to play unfit Shaheen Afridi: పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది కేవలం ఒకే ఒక్క ప్రపంచకప్ టోర్నీకి పరిమితమయ్యే ప్లేయర్ కాదని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నాడు. షహీన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని అవసరం పీసీబీకి ఎంతైనా ఉందని.. వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టీ20 ప్రపంచకప్ 2022లో ఆడించాలని సూచించాడు. మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022కు దూరమైన షహీన్.. ఆపై ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. చికిత్స తీసుకున్న షహీన్.. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు.
షహీన్ షా అఫ్రిది గాయం నేపథ్యంలో సల్మాన్ భట్ మాట్లాడుతూ... 'షహీన్ అఫ్రిది కేవలం ఒకే ఒక్క ప్రపంచకప్ టోర్నీకి పరిమితమయ్యే ఆటగాడు మాతరం కాదు. ఫిట్‌గా ఉంటే ఐసీసీ టోర్నీలు ఎన్నో ఆడతాడు. ప్రపంచకప్‌లు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. షహీన్ గాయపడితే మాత్రం అతడి కెరీర్‌కే ప్రమాదం. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంది. రాబోయే 10 ఏళ్లలో మెగా టోర్నమెంట్లు చాలా జరుగుతాయి. అందుకే అఫ్రిది కెరీర్ మరింతకాలం కొనసాగాలంటే.. అతడిని పీసీబీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది' అని అన్నాడు.
సల్మాన్ భట్ కామెంట్లపై పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావెద్ స్పందించాడు. 'షహీన్ అఫ్రిది వంటి ఫాస్ట్ బౌలర్ ఎప్పుడోసారి మాత్రమే వస్తుంటారు. షహీన్‌కు నేను చెప్పేది ఒక్కటే.. ఫిట్‌గా లేకపోతే టీ20 ప్రపంచకప్ 2022 ఆడకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రపంచకప్ కంటే షహీన్ బౌలింగ్ పాక్ జట్టుకు చాలా ముఖ్యం' అని జావెద్ పేర్కొన్నాడు. మరోవైపు షహీన్ మాత్రం ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో సత్తాచాటాలని చూస్తున్నాడు. ఇందుకోసం ఓ ట్వీట్ కూడా చేశాడు. పాకిస్థాన్‌కు కీలక పేసర్‌గా మారిన షహీన్ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించాలని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.
Also Read: Dog Tiger Video: భారీ పులి చెవిని కొరికిన కుక్క.. పక్కనే సింహం! చివరకు ఏమైందంటే
Also Read: Sreeleela Mother: కుమార్తెకు తలనొప్పిగా మారిన శ్రీలీల తల్లి.. వరుస కేసులతో !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook