టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ 12 లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఊహించినట్టే రసవత్తరంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో..ఇండియా పైచేయి సాధించింది. చివరి ఓవర్‌లో నో బాల్ మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెల్‌బోర్న్ క్రికెట్ స్డేడియంలో ఇవాళ జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లోని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అందరికీ జీవితాంతం గుర్తుంటుంది. చివరి బంతివరకూ కొనసాగిన ఉత్కంఠ. ఫలితాన్ని మార్చిన నో బాల్. ఇలా అన్నీ ఆసక్తికర అంశాలే. చివరికి 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా..సూపర్ 12లో బోణీ చేసింది. చివరి క్షణం వరకూ టెన్షన్ రేపిన ఈ మ్యాచ్‌లో..చివరి ఓవర్ ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం..


మ్యాచ్‌లో చివరి ఓవర్ ఏం జరిగింది


టీమ్ ఇండియాకు చివరి ఓవర్‌లో విజయం సాధించేందుకు 16 పరుగులు అవసరమయ్యాయి. పాకిస్తాన్ తరపున చివరి ఓవర్‌ను మొహమ్మద్ నవాజ్ వేశాడు. చివరి ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. ఆ తరువాత 5 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. రెండవ బంతికి దినేశ్ కార్తీక్ ఒక రన్ తీసుకోగా..మూడవ బంతికి విరాట్ కోహ్లి 2 పరుగులు పూర్తి చేశాడు. ఇంకా మూడు బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. విరాట్ కోహ్లీ నాలుగవ బంతికి సిక్సర్ కొట్టగా అదృష్టవశాత్తూ అదే బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. ఫలితంగా ఓ బంతి అదనంగా వచ్చింది. ఆ తరువాత బంతికి విరాట్ కోహ్లీ క్లీన్‌బౌల్డ్ కాగా..ఫ్రీ హిట్ కావడంతో అవుట్ ఇవ్వలేదు. ఈలోగా మూడు పరుగులు పూర్తి చేశారు. చివరి బంతికి 2 పరుగులు కావల్సిన పరిస్థితి. మొహమ్మద్ నవాజ్ మరోసారి వైడ్ వేశాడు. దాంతో చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా..రవిచంద్రన్ అశ్విన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేశాడు.


Also read: Ind vs Pak: హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు, టీ20ల్లో వేయి పరుగులు, 50 వికెట్లు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook