Rahul Dravid COVID 19: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు అతడు దూరం!
Asia Cup 2022, India Coach Rahul Dravid tests positive for COVID-19. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Team India head coach Rahul Dravid tests positive for Coronavirus ahead of IND vs PAK Match: ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా వైరస్ సోకింది. తాజా పరీక్షల్లో ద్రవిడ్‌కు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందట. దాంతో ఆసియా కప్ 2022 కోసం యూఏఈకి పయనమవడం వాయిదా పడనుంది. 5 రోజులు ఐసోలేషన్ నిబంధనలు పాటించాల్సి ఉండడంతో.. మెగా టోర్నీ ఆరంభ మ్యాచులకు కోచ్ ద్రవిడ్ దూరం కానున్నాడు. టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.
జింబాబ్వే పర్యటన నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దాంతో హైదరాబాద్ సొగసరి, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వే వన్డే సిరీస్‌లో కోచ్‌గా వ్యవహరించారు. అయితే తాజాగా ద్రవిడ్ కరోనా బారిన పడినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యూఏఈకి బయల్దేరే ముందు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందట. దాంతో హెడ్ కోచ్ ద్రవిడ్ మెగా టోర్నీ ఆరంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
ఐసోలేషన్ నిబంధనల కారణంగా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు రాహుల్ ద్రవిడ్ దూరం కానున్నాడు. టోర్నీ మొత్తానికి దూరమయినా ఆశ్చర్యమేమీ లేదు. ఇక ద్రవిడ్ గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.
యూఏఈ వేదికగా ఆగష్టు 27న ఆసియా కప్ 2022 మొదలు కానుంది. తొలి మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక 28న దాయాది దేశాలు పాకిస్థాన్, భారత్ తలపడనున్నాయి. రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడి ఈ కీలక మ్యాచుకు దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ కూడా విలువైన సలహాలు ఇవ్వగలరు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్‌డేట్! దసరాకు భారీగా డబ్బులు
Also Read: Director Lingusamy: స్టార్ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. కారణం ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook