India vs Pakistan Asia Cup 2022 clash Hotstar TRP Ratings: ప్రపంచ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. టెస్ట్, వన్డే, టీ20.. మ్యాచ్ ఏదైనా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు అయితే ఒక్క బంతి కూడా మిస్ అవ్వరు. ఇండో-పాక్ మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠగా సాగుతుంది కాబట్టి ఫాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆసియా కప్‌ 2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం (ఆగష్టు 28) రాత్రి జరిగిన భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగింది. విజయం ఎవరిని వరిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. దాంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం జరిగిన భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచును గరిష్టంగా ఒక కోటి 30 లక్షల మంది చూశారు. ఇప్పటి వరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ ఈ మ్యాచుకే వచ్చాయి. ఇదివరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ ఒక కోటీ 20 లక్షలు. టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, ఐపీఎల్ 2022  ఫైనల్‌ మ్యాచుకు ఒక కోటీ 20 లక్షల వ్యూస్ వచ్చాయి. భారత్‌, పాకిస్థాన్ తాజా మ్యాచుతో టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు బద్దలు కొట్టినట్లే.


భారత్‌, పాకిస్థాన్ మ్యాచుకు ఈ వ్యూస్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిన కారణంగా ఈసారి రోహిత్ సేనపై భారీ అంచనాలు ఏర్పడడం, ఆదివారం కావడం, ఇరి జట్ల మధ్య చాలా రోజుల తరువాత మ్యాచ్ జరగడం, విరామం అనంతరం విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం వ్యూస్ రావడానికి కారణాలుగా చెప్పొచ్చు. అన్నిటింకి మించి మ్యాచ్ చివరి ఓవర్ వరకు జరగడం ప్రధాన కారణం. 


ఆసియా కప్‌ 2022లో భారత్ శుభారంభం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా (3/25), భువనేశ్వర్‌ కుమార్ (4/26) విజృంభించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. మొహ్మద్ రిజ్వాన్‌ (43; 42 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. అనంతరం భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6), రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్‌ పాండ్యా (33 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. 


Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్


Also Read: Telangana Police Constable : ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు.. కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి