Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు, మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని చాలా జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో అర్ధరాత్రి నుంచి కొన్ని జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నల్గొండ, వికారాబాద్ , యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 93 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ లో 69 మిల్లిమీటర్లు, సూర్యాపేట జిలా ఆత్మకూరులో 66, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 66, యాదాద్రి జిల్లా అడ్డగూడురులో 63 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 62, మంచిర్యాల జిల్లా అంగులపేటలో 57, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో 56, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి 56, కరీంనర్ జిల్లా గట్టుదండేపల్లిలో 53 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
Read also: Telangana Police Constable : ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు.. కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్
Read also: Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..అక్టోబర్ 17న ఎన్నికలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్