IND vs SA Live: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 60 పరుగులకే 3 వికెట్లు.. రోహిత్ డకౌట్..
IND vs SA 01st Test: తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
IND vs SA 01st Test live Score updates: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్ లోనూ తడబడుతున్నారు. సఫారీ బౌలర్ల సంధిస్తున్న బౌన్సర్లకు మన బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌట్ కాగా.. యశస్వీ జైస్వాల్ ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ ను రబాడ ఔట్ చేయగా..జైస్వాల్ ను బర్గర్ బోల్తా కొట్టించాడు. అనంతరం గిల్ కు జతకలిసిన కోహ్లీ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో జాన్ సేన్.. గిల్ వికెట్ తీసి టీమిండియాకు షాక్ ఇచ్చాడు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.
అంతకముందు ప్రోటీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీ జట్టు 163 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెంచరీ హీరో డీన్ ఎల్గర్ రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. మరో ఎండలో జాన్‌సేన్ కూడా అద్భుతంగా ఆడటంతో టీమిండియా బౌలర్లకు వికెట్ కు రాలేదు. డీన్ ఎల్గర్ 185 పరుగులు చేసి ఔటయ్యాడు. డబుల్ సెంచరీదిశగా దూసుకెళ్తున్న అతడినిను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ కు పంపడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
ఆ తర్వాత ఓ పక్క జాన్‌సేన్ నిలకడగా ఆడుతున్న అతడికి సహకరించే వారే కరవయ్యారు. బుమ్రా(Bumrah) చెలరేగడంతో సఫారీ జట్టు 9 వికెట్లు వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. అయితే పదో వికెట్ గా రావాల్సి కెప్టెన్ బవుమా బ్యాటింగ్ కు రాలేదు. దీంతో టీ సెషన్‌కు ముందే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. చివరకు మార్కో జాన్‌సేన్ 84 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook