Hardik Pandya Deal: ఐపీఎల్ 2024 సీజన్ 17 వ్యవహారం సంచలనంగా మారింది. వేలంలో కొందరు ఆటగాళ్లకు రికార్డు ధర దక్కితే వేలానికి ముందే మరి కొన్ని సంచలనాలు చోటుచేసుకున్నాయి. అన్నింటికంటే సంచలనం కల్గించింది హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు రావడమే.
హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స జట్టును వదిలి ముంబై ఇండియన్స్ జట్టుకు రావడం అంత ఆషామాషీగా, సులభంగా జరిగిన వ్యవహారం కాదట. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే కొత్త ఫ్రాంచైజీ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. వరుసగా రెండవ టైటిల్ కూడా దాదాపు గెలిచినంత వరకూ వెళ్లింది. చివర్లో పైనల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో తృటిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. దాంతో గుజరాత్ టైటాన్స్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. అందుకే హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ వదులుకోవడం అంత సులభం కానే కాదు.
అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను వదులుకున్నది 2022లోనే. ముంబై వదులుకోవడంతో 2023లో గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. సరిగ్గా అదే రెండేళ్ల నుంచి ముంబై ఇండియన్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంటోంది. దాంతో హార్దిక్ పాండ్యాపై దృష్టి పెట్టింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. హార్గిక్ పాండ్యా జట్టులోకి వస్తే ఐదుసార్లు టైటీల్ సాధించిపెట్టిన రోహిత్ శర్మను సైతం పక్కన పెట్టేందుకు సిద్ధమైంది.
అందుకే ఐపీఎల్ వేలం కంటే ముందు ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను చేజిక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ జట్టుతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ట్రేడింగ్ అంటే ఆ ఆటగాడికి ఎంత విలువ ఉందో అంత ఆ జట్టుకు చెల్లించి తీసుకోవచ్చు. కానీ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో అనధికారికంగా వంద కోట్లు చెల్లించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. వంద కోట్లకు బదులుగానే హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టుకు వదులుకుందని సమాచారం.
Also read: Christmas Celebrations: తొలిసారి ఏసు క్రీస్తు వేడుకలకు దూరంగా బెత్లెహాం నగరం, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook