Virar Kohli: రేపే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు.. ద్రావిడ్, వీరూల రికార్డులపై కన్నేసిన కింగ్ కోహ్లీ..
Ind Vs Sa: రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు మ్యాచ్ లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు విరాట్.
Virar Kohli Records: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా రెడీ అయింది. రేపు (డిసెంబరు 26) సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ క్రమంలో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ఇప్పటికే వన్డేల్లో సచిన్ 49 సెంచరీల రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ.. ఇప్పుడు రాహుల్, వీరు రికార్డులను బద్దలుగొట్టాడనికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం సఫారీ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు రాహుల్, సెహ్వాగ్ మరియు సచిన్ ఉన్నారు.
దక్షిణాప్రికాపై 14 టెస్టులు ఆడిన కోహ్లీ 56.18 సగటుతో 1236 పరుగులు సాధించాడు. 1252 పరుగులతో ద్రావిడ్, 1306 రన్స్ తో సెహ్వాగ్, 1741 స్కోరుతో సచిన్ ఇతడి కంటే ముందున్నారు. కోహ్లీ ఇంకో 16 పరుగులు చేస్తే ద్రవిడ్ రికార్డును అధిగమిస్తాడు. వీరును దాటాలంటే మరో 70 పరుగులు చేయాల్సి ఉంటుంది. సచిన్ ను అధిగమించాలంటే 505 పరుగులు కావాలి. అయితే ఈ సిరీస్ లో సచిన్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సారి భారత్ రెండు టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది. అయితే ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులు రేపే బద్దలయ్యే అవకాశం ఉంది.
Also Read: Year Ender 2023: ఈ ఏడాది టీమిండియా బద్దలు కొట్టిన రికార్డులు ఇవే.. ఆ ఒక్కటి తప్ప..!
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (c), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (vc), ప్రసిద్ కృష్ణ, KS భరత్ (wk), అభిమన్యు ఈశ్వరన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook