Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్ శర్మకేనా

Hardik Pandya: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఏ టీమ్ ఆటగాళ్లెవరో తేలిపోయింది. వేలానికి ముందు గుజరాత్ టు ముంబై జంప్ అయిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు రానున్న ఐపీఎల్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. అసలేం జరిగింది...

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 23, 2023, 06:22 PM IST
Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్ శర్మకేనా

ఐపీఎల్ 2024 టోర్నీకు ముందే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జట్టు ముంబై ఇండియన్స్ జట్టు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై అభిమానుల ఆగ్రహానికి బరైన ఎంఐ జట్టుకు మరో షాక్ తగిలింది. కోరి తెచ్చుకున్న హార్దిక్ ఐపీఎల్ ఆడేట్టు లేడు.

చుట్టూ తిరిగి ఎవర్ని కాదనుకున్నారో ఆ వ్యక్తికే పగ్గాలు అప్పగించే పరిస్థితి కన్పిస్తోంది. ఇది ముంబై ఇండియన్స్ జట్టుకు ఎదురౌతున్న అనుభవం. ఇటీవల జరిగిన ఐపీఎల్ల 2024 వేలం కంటే ముందు గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు ఏరి కోరి ట్రేడ్ ద్వారా తెచ్చుకుంది. అంతేకాకుండా అప్పటి వరకూ ఐదుసార్లు టైటిల్ సాధించిపెట్టిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి..హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్ అని ప్రకటించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ ఎంఐ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఆ జట్టు అభిమానులకు ఆగ్రహ తెప్పించింది. రోజుల వ్యవధిలో ఎంఐ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఏకంగా 10 లక్షలమంది ఫ్యాన్స్ అన్ ఫాలో అయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. 

ఇప్పుడు ఏరికోరి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా రానున్న ఐపీఎల్ సీజన్ 17 ఆడే పరిస్థితి కన్పించడం లేదు. కారణం వన్డే ప్రపంచకప్ 2023లో తొలి నాలుగు మ్యాచ్‌ల తరువాత మడమకు గాయంతో తప్పుకున్నాడు. అప్పట్నించి విశ్రాంతిలో ఉన్న హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో త్వరలో జరిగే టీ20 సిరీస్, ఐపీఎల్ సీజన్ 17 కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై ఎంఐ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా దాదాపుగా ఐపీఎల్ సీజన్ 17 ఆడే అవకాశాలు మాత్రం లేవనే తెలుస్తోంది. 

నిజంగా ఐపీఎల్ సీజన్ 17 కు హార్దిక్ పాండ్యా దూరమైతే విధి లేక తిరిగి కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకే అప్పగించాల్సి వస్తుంది ఎంఐ జట్టు యాజమాన్యానికి. మరి అప్పుడైనా రోహిత్ శర్మ స్పందిస్తాడా, కెప్టెన్సీ పగ్గాలు స్వీకరిస్తాడా అనేది సందేహమే. 

Also read: IRCTC Package: మూడు అందమైన దేశాలు చుట్టివచ్చే అద్భుతమైన ప్యాకేజ్‌లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News