IND vs SA 1st T20I, Rishabh Pant becomes India second youngest T20I captain: స్వదేశంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బీసీసీఐ విశ్రాంతిని ఇవ్వడంతో పొట్టి సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ నాయకుడిగా వ్యవహరించాల్సి ఉన్నా.. గాయం కారణంగా అతడు టోర్నీ మొత్తానికి దూరమవడంతో రిషబ్‌ పంత్‌ సారథిగా ఎంపికయ్యాడు. నేడు జరిగే తొలి టీ20 మ్యాచుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో.. ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అతి చిన్న వయసులో భారత జట్టు టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రెండో ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. పంత్ 24 ఏళ్ల వయస్సులో కెప్టెన్సీ అందుకున్నాడు. అతి తక్కువ వయసులో టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆటగాడిగా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. రైనా 23 సంవత్సరాల 197 రోజుల వయసులో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ రికార్డులో ఇప్పటికీ రైనానే తోపు. 


ఈ జాబితాలో సురేశ్ రైనా, రిషబ్ పంత్ తర్వాత ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్ వరుసగా ఉన్నారు. 2007లో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్సీ వహించినప్పుడు ధోనీ వయస్సు 26 సంవత్సరాలు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ కెప్టెన్ సెహ్వాగ్ 28 సంవత్సరాలు. 2017లో ఇంగ్లండ్ జట్టుపై పగ్గాలు అందుకున్న కోహ్లీ వయసు 28 సంవత్సరాలు. 2015లో జింబాబ్వే పర్యటనలో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే వయసు 28ఏళ్లు కాగా.. 30ఏళ్ల వయస్సులో రాహుల్ టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 


భారత జట్టు: 
రిషబ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.


Also Read: Godse Movie Trailer: అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి! మర్యాద ఉన్నోడే..


Also Read: Balakrishna Birthday: బాల‌కృష్ణ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా.. 'ఎన్‌బీకే 107' టైటిల్, టీజర్‌కి టైమ్ ఫిక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook