Sunil Gavaskar feels Team India do not have wicket-taking bowlers: ఆదివారం టీమిండియాతో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. హెన్రిచ్‌ క్లాసెన్‌  (81; 46 బంతుల్లో 7×4, 5×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ (4/13) అద్భుతంగా బౌలింగ్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండో టీ20లోనూ భారత్ ఓటమిపాలవ్వడంపై టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'భారత జట్టులో భువనేశ్వర్‌ కుమార్ తప్పితే.. మరో వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌ లేడు. ఈ టీ20 సిరీస్‌లో అతిపెద్ద సమస్య ఇదే. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు. రెండు మ్యాచ్‌ల్లోనూ భువనేశ్వర్‌ మినహా ఎవరైనా వికెట్‌ కనిపించారా?. భువీ బాగా బౌలింగ్ వేస్తున్నాడు. తొలి టీ20లో 211 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా.. మ్యాచ్ గెలవలేకపోవడానికి కారణం అదే' అని అన్నారు. 


స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్ రెండో టీ20లో కూడా విఫలమయ్యారు. అక్షర్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చాడు. ఇక చహల్ నాలుగు ఓవర్లలో ఏకంగా 49 రన్స్ ఇచ్చాడు. ఇక దినేష్ కార్తీక్ వంటి ఫినిషర్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను పంపడంపై సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. ఖచ్చితంగా అక్షర్ కంటే ముందు కార్తీక్‌ను బ్యాటింగ్‌లో ముందు పంపించాల్సి ఉండే. ఫినిషర్ కాబట్టి 15వ ఓవర్ తర్వాత మాత్రమే బ్యాటింగ్‌కు పంపించాలనే నియమాలు ఏమీ లేవు. ఐపీఎల్ టోర్నీలో 12వ లేదా 13వ ఓవర్‌లో కూడా పంపిన సందర్భాలు ఉన్నాయి' అని సన్నీ గుర్తుచేశారు. 


కటక్‌లోని స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (34), శ్రేయస్‌ అయ్యర్‌ (40), దినేశ్‌ కార్తీక్‌ (30) రాణించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఈ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. క్లాసెన్‌ (81) చెలరేగడంతో ప్రొటీస్ సునాయాస విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌ మంగళవారం విశాఖపట్నంలో జరుగుతుంది.


Also Read: Rishabh Pant: అందుకే ఓడిపోయాం.. ఇక మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే: పంత్


Also Read: Whatsapp Pay Cashback: వాట్సాప్ యూజర్స్‌కు రూ.105 క్యాష్ బ్యాక్ ఆఫర్.. ఎలా పొందాలో తెలుసుకోండి..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.