IND vs SA 2nd T20I Weather Report Update: ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత జట్టు ప్రత్యర్థి దక్షిణాఫ్రికాకి బదులిచ్చేందుకు సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో గెలుపే లక్ష్యంగా పంత్ సేన బరిలోకి దిగుతోంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్‌ భావిస్తుండగా.. ప్రొటీస్ ఆధిక్యం సాధించాలని చూస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు రెండు ఏళ్ల తర్వాత కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్స్ కొనుగోలు చేసిన అక్కడి ఫాన్స్ ఇప్పటికే సిద్దమైపోయారు. అయితే అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. రెండో టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయట. ఆదివారం సాయంత్రం మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసి) వెల్లడించింది. 


'ఆదివారం సాయంత్రం కటక్‌లో వర్షం పడదని మేము ఖచ్చితంగా చెప్పలేము. ఒకటి రెండు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం పడే ఛాన్స్‌ మాత్రం లేదు. 50% వ‌ర్షం ప‌డే ఛాన్స్‌ ఉంది. వరుణుడు ఆటపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువ' అని భువనేశ్వర్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ హెచ్‌ఆర్ బిశ్వాస్‌ ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఒక వేళ వర్షం పడినా మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఓసీఏ) అధికారి ఒకరు వెల్లడించారు. ఫీల్డ్ ఆఫ్ ప్లే ప్రాంతానికి రెయిన్ కవర్‌ ఉందని, మెరుగైన డ్రైనేజీ ఉందని చెప్పారు. 


Also Read: Anupama Parameswaran: ఆ టాలీవుడ్ హీరో కోసం.. బురఖాలో వెళ్లిన అనుపమ పరమేశ్వరన్‌!


Also Read: Chiranjeevi-kamal Haasan: చిరంజీవి ఇంట్లో క‌మ‌ల్ హాస‌న్.. పార్టీలో సల్మాన్‌ ఖాన్‌ సందడి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.