India vs South Africa 2nd Test Updates: కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో, చివరి టెస్టులో బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తొలి రోజు ఏకంగా మొత్తం 23 వికెట్లు పడ్డాయి. రెండు జట్లలో పేసర్లు చెలరేగడంతో తొలి రోజే ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇలానే కొనసాగితే.. రేపే ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐడెన్ మార్క్రామ్ (36), డేవిడ్ బెడింగ్‌హామ్ (7) అజేయంగా వెనుదిరిగారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ముఖేష్ కుమార్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా పేసర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. 


ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండా పెవిలియన్‌కు చేరుకున్నారు. జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ అయ్యారు. ముఖేష్ కుమార్ (0) నాటౌట్‌గా మిగిలాడు. కేఎల్ రాహుల్ 8 రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు  98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, లుంగి ఎం‌గిడి, నాండ్రే బెర్గర్ తలో 3 వికెట్లు తీశారు. 


రెండో ఇన్సింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్ కంటే మెరుగ్గానే ఆడింది. ఓపెనర్లు మర్క్రామ్, ఎల్గర్ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ముఖేష్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో ఎల్గర్ (12), జోర్జి (1) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించాడు. కాసేపటికే స్టబ్స్ (1)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ బెడింగ్‌హామ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. గురువారం ఆటలో తొలి సెషన్ కీలకంగా మారనుంది. కాగా.. ఒక టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు అత్యధిక వికెట్లు (23) పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. 1902లో ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి రోజే 25 వికెట్లు తీశారు.


Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!


Also Read: Oneplus Buds 3 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..చీప్‌గా మార్కెట్‌లోకి OnePlus బడ్స్‌ 3..ధర, ఫీచర్స్‌ వివరాలు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి