India Vs South Africa 2nd Test Playing 11: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో, చివరి టెస్టు మ్యాచ్‌కు కేప్‌టౌన్ వేదికగా రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమైన భారత్.. తప్పులను సరిదిద్దుకుని రంగంలోకి దిగుతోంది. సెంచూరియన్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయిన రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సఫారీ బౌలింగ్ దళం ముందు మన బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా బ్యాట్లేత్తేయడం ఆందోళన కలిగించింది. దక్షిణాఫ్రికా విషయానికొస్తే కెప్టెన్ టెంబా బావుమా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సీనియర్ ఆటగాడు డీన్ ఎల్గర్‌కు పగ్గాలు అప్పగించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. అశ్విన్ స్థానంలో జడేజా, శార్దుల్ ఠాకూర్ ప్లేస్‌లో ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా కూడా ప్లేయింగ్ 11లో మూడు మార్పులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మేం మొదట బ్యాటింగ్‌కి చేస్తాం. పిచ్ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. మేము మంచి పొజిషన్‌లో ఉన్నాం. మొదటి విజయం సాధించకపోతే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలవలేం. మేము ఆ అడ్డంకిని అధిగమించాం. టీమిండియాపై ఇన్నింగ్స్ బాగా ప్రారంభించడం కీలకం. టెంబా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్‌లో జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా కోయెట్జీ దూరమయ్యాడు. ఎంగిడి, మహరాజ్ తుది జట్టులోకి వచ్చారు.." అని సౌతాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ తెలిపాడు.


"టాస్ గెలిచి ఉంటే మేము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లం. మంచి పిచ్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేయడంలో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. ఈ పిచ్‌లో సీమర్‌లకు తగినంత సహకారం ఉంటుంది. మేము దానిని క్యాష్ చేసుకుంటాము. గతంలో ఏం జరిగిందో మర్చిపోవడం ముఖ్యం. జట్టులో రెండు మార్పులు జరిగాయి. అశ్విన్ స్థానంలో జడేజా తిరిగి వచ్చాడు. శార్దూల్ ప్లేస్‌లో ముఖేష్ కుమార్ జట్టులోకి వచ్చాడు." టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


తుది జట్లు ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్


దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.


Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!


Also read: Oneplus Buds 3 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..చీప్‌గా మార్కెట్‌లోకి OnePlus బడ్స్‌ 3..ధర, ఫీచర్స్‌ వివరాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter