Team India Dance: దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం.. డాన్స్ చేసిన భారత ప్లేయర్స్! అబ్బా అనిపించిన ధావన్
Team India dance video goes viral after wins ODI Series vs South Africa. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1తో ఖాతాలో వేసుకున్న భారత ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో `బోలో తారా రా రా` పాటకు డ్యాన్స్ చేశారు.
Team India dance video goes viral after wins ODI Series vs South Africa: దక్షిణాఫ్రికాపై ప్రధాన భారత జట్టు టీ20 సిరీస్‌ను చేజిక్కించుకుంటే.. ద్వితీయశ్రేణి జట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. వన్డే సిరీస్‌ను 2-1తో ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2022 కోసం ప్రధాన ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో ఉన్నా.. బ్యాటింగ్‌లో సీనియర్ ప్లేయర్ కమ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడు మ్యాచ్‌ల్లో (25) విఫలం అయినా.. యువకులు పట్టు వదల్లేదు. తొలి వన్డేలో ఓడినప్పటికీ.. ఆ తర్వాత బలంగా పుంజుకుని చివరి రెండు వన్డేల్లోనూ అద్భుత విజయాలు సాధించారు.
వర్షం కారణంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బౌలర్లకు పూర్తి సహకారం అందించడంతో భారత బౌలర్లు చెలరేగారు. మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 99 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (34; 42 బంతుల్లో 4×4) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. కుల్దీప్ యాదవ్ (4/18) నాలుగు వికెట్లతో చెలరేగాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ (49; 57 బంతుల్లో 8×4), శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్; 23 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ విజయంతో భారత కెప్టెన్ శిఖర్ ధావన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధావన్ మాత్రమే కాదు టీమిండియా యువ ప్లేయర్స్ అందరూ ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్స్ అందరూ కలిసి 'బోలో తారా రా రా' పాటకు డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ధావన్, సిరాజ్ డాన్స్ అందరిని ఆకట్టుకుంది. సహచరులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోకు ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లోలో పోస్ట్ చేశాడు. 'జీత్ కే బోలో తారా రా రా' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల వర్షం కురుస్తోంది.
Also Read: సిల్లీ కారణంతో.. జిమ్‌లో జట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు! వీడియో చూస్తే నవ్వులే
Also Read: Impact Player: క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook