Kohli National Anthem: విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ ఆగ్రహం.. జాతీయ గీతాలాపనలో ఏం చేశాడంటే?
Kohli National Anthem: టీమ్ఇండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండే విరాట్.. ఇప్పుడు చాలా నెమ్మదిగా కనిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేకు ముందు కోహ్లీ ప్రవర్తన ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
Kohli National Anthem: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో మూడో వన్డేకు ముందు జాతీయ గీతాలపన సమయంలో విరాట్ కోహ్లీ ప్రవర్తనే అందుకు కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.
మ్యాచ్ ఆడే సమయంలో ఎన్ని భావోద్యేగాలున్నా.. దేశం పట్ల ఉన్న అమితమైన గౌరవాన్ని కలిగిన కోహ్లీ.. జాతీయ గీతం పాడే క్రమంలో చూయింగ్ గమ్ నమలడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఎప్పుడూ లేని విధంగా కోహ్లీ ప్రవర్తన చూసిన టీమ్ఇండియా అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కోహ్లీ ప్రవర్తన అసలు బాగోలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నందున కోహ్లీ తీవ్ర నిరాశలో ఉన్నాడని కొందరు చెబుతుండగా.. జాతీయ గీతం ఆలపించే సమయంలో అలాంటి ప్రవర్తన తగదని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది.
క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియా కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ ఇటీవలే గుడ్ బై చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడు జట్టులో ఓ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. మైదానంలో ఎప్పుడూ ఫైర్ మీద ఉండే కోహ్లీ.. ఇప్పుడు కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నాడు.
కోహ్లీ ఇలా మారడానికి ప్రధాన కారణం బీసీసీఐ పాలక మండలి (BCCI) అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గంగూలీ, జై షాలు జట్టు నుంచి సైతం తప్పిస్తామని వార్నింగ్‌లు ఇచ్చారని, అందుకే కోహ్లి ఇలా వ్యవహరిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: IPL 2022: దేశీయంగానే ఐపీఎల్ 2022.. కానీ ఆడియన్స్ లేకుండానే!
Also Read: Sanjay Manjrekar: టీమ్ ఇండియా సెలెక్షన్‌పై మండిపడ్డ సంజయ్ మంజ్రేకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook