IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ పూర్తిగా దేశీయంగానే జరగనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు (BCCI on IPL 2022) తెలిసింది.
దేశీయంగా జరగటం మాత్రమే కాకుండా.. మ్యాచ్‌లు అన్ని కూడా ఒకే నగరంలో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీజన్ మొత్తం ముంబయిలోనే నిర్వహించాలని బీసీసీఐ (IPL 2022 entirely conduct in Mumbai) భావిస్తోందట. వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ), డీవై పాటిల్ స్టేడియంలలో మ్యాచ్‌లు నిర్వహించాలని ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు తెలిసింది. మరీ అవరమైతే మహారాష్ట్ర దాటుకుండా.. పుణెలోని స్టేడియంలో కూడా మ్యాచ్‌లు నిర్వహించే వీలుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇక కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ (IPL 2022 held without audience) భావిస్తోందని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
మెగా వేలానికి సర్వం సిద్ధం..
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు మెగా వేలం ప్రక్రియ (IPL mega auction 2022) జరగనుంది. వేలలో పాల్గొనే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 20తో గడువు ముగిసింది. మొత్తం 1,214 మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 896 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 318 మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు.
వీరిలో 270 మంది క్యాప్‌డ్, 903 మంది అన్‌క్యాప్‌డ్, 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉండటం గమనార్హం.
మొత్తం 10 టీమ్‌లు ఈ మెగా వేలంలోనే ప్లేయర్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితో ఈ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ వేలం ప్రక్రియ (IPL mega auction 2022 Dates) జరగనుంది.
Also read: Pakistan Tour: లాహోర్ పేలుళ్లతో ఆసీస్ జట్టు పాక్ పర్యటనపై నీలినీడలు
Also read: Sanjay Manjrekar: టీమ్ ఇండియా సెలెక్షన్‌పై మండిపడ్డ సంజయ్ మంజ్రేకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook