IND vs SA 3rd T20I On-Line Tickets sold out with in an Hour in Visakhapatnam: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ గురువారం నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుండగా.. మ్యాచ్ 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా, భారత్ జట్టు ప్రాక్టీస్ మొదలెట్టాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం ఢిల్లీలో జరుగనున్న మొదటి టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 34 వేల మంది సామర్థ్యం గల అరుణ్‌ జైట్లీ మైదానంలో 94 శాతం సీట్లు బుక్‌ అయ్యాయని డీడీసీఏ కార్యదర్శి రాజన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు మైదానంలోకి  ప్రవేశించడానికి గోల్ఫ్‌ కార్ట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇక జూన్ 12న ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ తొలి టిక్కెట్‌ను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు.


భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య  విశాఖపట్నంలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంట వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయట. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విశాఖపట్నంలో ఒక్క మ్యాచ్ జరగని విషయం తెలిసిందే. అందుకే తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు ఫాన్స్ ఎగబడుతున్నారు.


మరోవైపు ఈ రోజు (జూన్‌ 8) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, రామ టాకీస్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్‌ ఫాన్స్.. టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిలబడ్డారు. టికెట్స్ దొరికిన వారు ఆనందపడుతుండగా.. దొరకని వారు నిరాశకు గురవుతున్నారు. 


Also Read: Mithali Raj Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్.. త్వరలోనే రెండో ఇన్నింగ్స్!  


Also Read: Virat Kohli Record: విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. ఏకైక క్రికెటర్‌గా రేర్ రికార్డు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి