Virat Kohli Record: విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. ఏకైక క్రికెటర్‌గా రేర్ రికార్డు!

Virat Kohli becomes first Cricketer to reach 200 million followers on Instagram. విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 01:45 PM IST
  • విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత
  • ఏకైక క్రికెటర్‌గా రేర్ రికార్డు
  • మూడో క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు
Virat Kohli Record: విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. ఏకైక క్రికెటర్‌గా రేర్ రికార్డు!

Virat Kohli becomes first Cricketer to reach 200 million followers on Instagram: టీమిండియా మాజీ కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి నిరూపితమైంది. ఇన్‌స్టాలో కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 200 మిలియన్ మార్క్​ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. అంతేకాక తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

విరాట్‌ కోహ్లీ మంగళవారం (జూన్ 7) ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్నాడు. దాంతో కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో ​​రొనాల్డో (450 మిలియన్ల ఫాలోవర్లు), లియోనెల్ మెస్సీ (333 మిలయన్ల ఫాలోవర్లు) తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. ఇక భారత దేశంలో ఏ ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటులకు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న సందర్భంగా విరాట్ కోహ్లీ స్పందించాడు. '200 మిలియన్ స్ట్రాంగ్. ఇంత భారీ మద్దతు ఇస్తున్నందుకు ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో కోహ్లీ నిత్యం యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. క్రికెట్, ఫామిలీకి సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటాడు. కోహ్లీకి టీమిండియాలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 101 టెస్టులాడి 52.0 సగటుతో 8043 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 260 వన్డేల్లో 58.1 సగటుతో 12311 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 97 టీ20లలో 51.5 సగటుతో 3296 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేలకు పైగా పరుగులు చేశాడు.

Also Read: Hanuman Movie: 'హ‌నుమాన్' నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్.. విలన్‌గా స్టార్ హీరో! ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్ అదుర్స్  

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.79వేలు విలువ చేసే ఐఫోన్‌పై భారీ తగ్గింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News