IND Vs SA 3rd Test: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో రికార్డు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియా బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఘనతను సాధించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్‌ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి రోజే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ అరుదైన రికార్డును చేరుకున్నాడు. 


దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో లెజండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఉన్నాడు. సౌతాఫ్రికా వేదికగా సచిన్ ఆడిన 15 మ్యాచ్ లలో 1,161 పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ ఆడిన ​11 టెస్టుల్లో 624 పరుగులతో ఇప్పుటి వరకు ఆ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 


కానీ, సౌతాఫ్రికా టీమ్ పై 7 టెస్టులు ఆడిన విరాట్‌ కోహ్లీ.. 50కి పైగా సగటుతో 688 పరుగులు చేసి.. రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ ఆడిన 7 టెస్టుల్లో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 


కేప్​టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్​లో కోహ్లీసేన 223 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ (79) జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. పుజారా (43), పంత్ (27) ఫర్వాలేదనిపించారు. రహానే (9), అశ్విన్ (2), శార్దూల్ ఠాకూర్ (12) ఘోరంగా విఫలమయ్యారు. 


తొలి ఇన్నింగ్స్ లో ఆడిన 77 ఓవర్లలో 223 పరుగులు చేసింది భారత్. తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహారాజ్ (6), మార్​క్రమ్ (8) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఓ వికెట్ తీశాడు.  


Also Read: IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి వేళాయే- తేదీలను ఫిక్స్ చేసిన బీసీసీఐ


Also Read: IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి వేళాయే- తేదీలను ఫిక్స్ చేసిన బీసీసీఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి