Shikhar Dhawan to lead Indian Cricket Team in South Africa ODI Series: ఆదివారం ముగిసిన ఆసియా కప్ 2022లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసింది. సూపర్ 4 దశలో వరుసగా రెండు మ్యాచులు ఓడిన టీమిండియా.. ఫైనల్ చేరకుండగానే ఇంటిదారి పట్టింది. అయితే ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 టోర్న‌మెంట్‌లో  భారత జట్టును తక్కువ అంచనా వేయలేం. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ జట్టులోకి రానుండడంతో భారత్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడనుంది. ఇవి మెగా టోర్నీకి మంచి సన్నద్ధతగా మారనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్‌లు ఆడనుంది. ముందుగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌ జరగనుంది. నివేదికల ప్రకారం.. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వన్నారట. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు వన్డే సిరీస్ ఆడరని సమాచారం. దాంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. ఇంతకుముందు కూడా ధావన్ చాలా సందర్భాలలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.


సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ వన్డే సిరీస్‌ను కలిగి ఉండటం సరికాదు. అయితే కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే ఆటగాళ్లందరికీ వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిస్తాం. దాంతో ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు వారికి స్వల్ప విరామం లభించనుంది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు' అని అన్నారు. 


సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 టీ20, 3 వన్డే సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 సెప్టెంబర్ 28న జరగనుంది. రెండో టీ20 అక్టోబర్ 2న, మూడో టీ20 అక్టోబర్ 4న జరగనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 6న జరగనుండగా.. రెండో వన్డే అక్టోబర్ 9న, మూడో వన్డే అక్టోబర్ 11న జరగనుంది.


Also Read: బంగారం ప్రియులకు ఊరట.. పరుగులు తీస్తున్న పసిడి ధరలకు బ్రేక్! భారీగా తగ్గిన వెండి


Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook