Gold Price Today 12 September: బంగారం ప్రియులకు ఊరట.. పరుగులు తీస్తున్న పసిడి ధరలకు బ్రేక్! భారీగా తగ్గిన వెండి

Gold Price Today 12 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 08:52 AM IST
  • స్థిరంగా బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today 12 September: బంగారం ప్రియులకు ఊరట.. పరుగులు తీస్తున్న పసిడి ధరలకు బ్రేక్! భారీగా తగ్గిన వెండి

Gold and Silver Price Today 12 September 2022: దేశంలోని బంగారం ప్రియులకు ఊరట. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలకు.. గత రెండు రోజులుగా బ్రేక్ పడింది. శని, ఆదివారం కొనసాగిన ధరలే నేడు కొనసాగుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్‌ 12) బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,750లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000లుగా ఉంది. ఈ ధరలు నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,150గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,710 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ. 5,400 తగ్గింది. నేడు (సెప్టెంబర్ 12) దేశీయంగా కిలో వెండి ధర రూ. 55,000లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో రూ. 5,400 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 55,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 60,400లుగా ఉంది. బెంగళూరులో రూ. 60,400గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 60,400లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 60,400ల వద్ద కొనసాగుతోంది. 
Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!

Also Rad: Asia Cup 2022 Winner: ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు.. ఆసియా 2022 'కింగ్‌' శ్రీలంక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News