IND vs SA: సింపుల్ క్యాచ్ మిస్ చేసిన పుజారా.. టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ!!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో చేతేశ్వర్ పుజారా కారణంగా టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ పడింది.
Cheteshwar Pujara drops Temba Bavuma Catch, South Africa gets 5 Penalty Runs: క్రికెట్ ఆటలో పెనాల్టీ పరుగులు (Penalty Runs) ఫీల్డింగ్ చేసే జట్టుకు చాలా అరుదుగా వస్తుంటాయి. టెస్ట్ మ్యాచుల్లో కీపర్లు ఎక్కువగా పేసర్ల బౌలింగ్‌లో తమ హెల్మెట్‌ను తీసేసి కీపింగ్ చేస్తారు. అలాంటి సమయంలో ఒక్కోసారి బంతి కీపర్ తప్పిదం వలన వెనకాల ఉన్న హెల్మెట్‌ను తాకుతుంటుంది. అప్పుడు ఫీల్డ్ అంపైర్.. పెనాల్టీ కింద బ్యాటింగ్ చేసే జట్టుకు ఐదు పరుగులు (Five Penalty Runs) ఇస్తాడు. చాలా అరుదుగా మాత్రమే ఫీల్డర్ కారణంగా పెనాల్టీ పడుతుంది. తాజాగా టీమిండియా (Team India)కు ఇదే జరిగింది. టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) కారణంగా టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ పడింది. విషయంలోకి వెళితే...
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ (IND vs SA) జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ శార్దుల్ ఠాకూర్ వేసిన బంతిని ప్రోటీస్ బ్యాటర్ తెంబా బవుమా (Temba Bavuma) ఆడగా.. అదికాస్త మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న చేతేశ్వర్ పుజారా బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లిన కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్ (Ball Hits Helmet)ను తాకింది. దాంతో ఐసీసీ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా జట్టుకు అంపైర్ ఐదు పరుగులను అదనంగా ఇచ్చాడు.
Also Read: Today Horoscope January 13 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!!
బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7) త్వరగానే ఔట్ కాగా.. విరాట్ కోహ్లీ (14), చేతేశ్వర్ పుజారా (9) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా (Bumrah) 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం 70 పరుగుల ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.
Also Read: Vaikunta Ekadasi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం.. ఉపవాస సమయ, నియమాలు ఇవే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి