Horoscope January 13 2022: ఈ రోజు వైకుంఠ ఏకాదశి.. ఆ రాశి వారిపై అనుకూల ప్రభావం..

మేషం: మనో ధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం చదవాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 08:40 AM IST
  • గురువారం.. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం
Horoscope January 13 2022: ఈ రోజు వైకుంఠ ఏకాదశి.. ఆ రాశి వారిపై అనుకూల ప్రభావం..

Today's Horoscope January 13 2022:

మేషం: మనో ధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం చదవాలి.

వృషభం: ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం: దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. శ్రమ పెరిగినప్పటికీ.. మంచి చేకూరుతుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.

కర్కాటకం: మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తవహించండి. నూతన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. ఇష్టమైన దైవాన్ని ఆరాధించండి.

Also Read: Vaikunta Ekadasi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం.. ఉపవాస సమయ, నియమాలు ఇవే!!

సింహం: అర్థలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనఃసౌఖ్యం కలదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి.స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇష్ట దైవారాధన శుభప్రదం.

కన్య: అనారోగ్య బాధలు అధికమవుతాయి. కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. వ్యాపార రంగంలోని వారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. హనుమాన్ చాలీసా చదవాలి.

తుల: మానసిక ఆందోళన తొలగుతుంది. ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

Also Read: Krithi Shetty Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ కన్నడ ముద్దుగుమ్మ

వృశ్చికం: రుణ ప్రయత్నం ఫలిస్తుంది. గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు: కుటుంబ కలహాలు దూరమవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవాలి.

మకరం: కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కుంభం: శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. ఇష్టదైవ ప్రార్థన మంచిది.

Also Read: TRS MLA Covid positive : టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌

మీనం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోనివారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News