Cheteshwar Pujara feels Virat Kohli Will Be Fit Very Soon and play 3rd Test: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని సీనియర్‌ బ్యాటర్ ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ విషయంలో బీసీసీఐ త్వరలోనే నుంచి ప్రకటన వస్తుందన్నాడు. మూడో టెస్టుకు విరాట్ అందుబాటులో రావొచ్చు అని పుజారా పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు వెన్ను నొప్పి కారణంగా కోహ్లీ అఖరి నిమిషంలో తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో విరాట్‌ స్ధానంలో ఓపెనర్ కేఎల్‌ రాహుల్ (KL Rahul) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో రోజు ఆట అనంతరం ఛెతేశ్వర్‌ పుజారా మీడియాతో మాట్లాడుతూ... విరాట్ కోహ్లీ ఆరోగ్యంపై స్పందించాడు. 'విరాట్ కోహ్లీ ఆరోగ్యంపై నెను ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేను. కానీ కోహ్లీ కోలుకుంటున్నాడు. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడు. జట్టు ఫిజియో ఈ విషయంపై స్పష్టత ఇవ్వగలడు. త్వరలోనే బీసీసీఐ కూడా అధికారిక ప్రకటన చేస్తుంది. మూడో టెస్టుకు విరాట్ అందుబాటులో ఉంటాడని నేను అనుకుంటున్నా' అని పుజారా చెప్పాడు. తిరిగి ఫిట్‌నెస్‌ (Kohli Fitness) సాధించాడనికి నెట్స్‌లో కోహ్లీ చెమటోడ్చుతున్నాడు. విరాట్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.


Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!


టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) త్రోడౌన్‌ బౌలింగ్‌ చేస్తుండగా విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. మైదానంలో ద్రవిడ్ పలు రకాల బంతులు సందిస్తుండగా.. విరాట్ షాట్లు (Kohli Practice) ఆడాడు. దాంతో జనవరి 11నుంచి కేప్ టౌన్‌లో ప్రారంభం కానున్న అఖరి టెస్ట్‌లో కోహ్లీ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఒకవేళ విరాట్ కేప్ టౌన్‌ టెస్ట్‌లో ఆడితే అతడి కెరీర్‌లో 99వ టెస్టు మ్యాచ్ అవుతుంది. ఇప్పటికే 98 టెస్టులు ఆడిన కోహ్లీ.. 50.3 యావరేజితో 7854 రన్స్ చేశాడు. ఇందులో 27 హాఫ్ సెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ అత్యధిక స్కోర్ 254 నాటౌట్. 




ఇక జోహన్నెస్‌బర్గ్‌ టెస్ట్‌ (Johannesburg Test) విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాకు భారత్‌ (IND vs SA) 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత్‌ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. మరోవైపు దక్షిణాఫ్రికా గెలవాలంటే 122 పరుగులు చేయాలి. మూడు మ్యాచుల టెస్ట్ సిరీసులో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో ప్రొటీస్ గెలిస్తే.. సిరీస్ 1-1తో సమం అవుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోనుంది. 


Aslo Read: ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను! రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook