Keegan Petersen takes one-handed diving catch to dismiss Cheteshwar Pujara: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్ (Keegan Petersen) పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు పుజారా పెవిలియన్ చేరాడు. కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో భారత్ (Team India) కష్టాల్లో పడడం పాటు భారీ స్కోరుపై ఆశలు అడియాసలయ్యాయి. పీటర్సన్ పెట్టిన అద్భుత క్యాచ్ (Catch) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో రోజు ఆట మొదలైన రెండో బంతికే చెతేశ్వర్ పుజారా పెవిలియన్ చేరాడు. మూడో రోజైన గురువారం ఆటలో రెండో బంతికే మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో పుజారా అవుటయ్యాడు. 125 కిలో మీటర్ల వేగంతో జాన్సెన్‌ షార్ట్ పిచ్ బంతి సాధించగా.. పుజారా పూర్తిగా లెగ్ సైడ్ షాట్ ఆడాడు. బ్యాట్ హ్యాండిల్ తాకిన బంతి లెగ్ స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కీగన్ పీటర్సన్ ఆఫ్ సైడ్ దూసుతూ.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ (One-Handed Diving Catch) అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన పూజి ఒక్కసారిగా బిత్తరపోయాడు. 


Also Read: Anasuya Bharadwaj: లంగాఓణీలో మెరిసిన అనసూయ.. నడుము వొంపులు మాములుగా లేవుగా!!


కీగన్ పీటర్సన్ పట్టిన క్యాచ్‌ను చూసి మ్యాచ్ కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. అన్‌బిలీవబుల్ క్యాచ్ అంటూ ప్రశంసించారు.  దక్షిణాఫ్రికా బ్యాటర్ పీటర్సన్ పట్టిన క్యాచ్‌కు సంబందించిన వీడియోను క్రికెట్ దక్షిణాఫ్రికా తం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అదికాస్త నెట్టింట వైరల్ అయింది. 'స్టన్నింగ్ క్యాచ్', 'సూపర్ క్యాచ్', 'క్యాచ్ ఆఫ్ ది ఇయర్' అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో పీటర్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అందరూ విఫలమయినా.. సూపర్ హాఫ్ సెంచరీ (72)తో జట్టును ఆదుకున్నాడు. 




చెతేశ్వర్ పుజారా పెవిలియన్ చేరిన కొద్దిసేపటికే అజింక్య రహానే (Rahane) కూడా అవుట్ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జింక్స్ నిష్క్రమించాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు కాగిసో రబడ (Rabada) బౌలింగ్‌లో ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో స్వల్ప పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే విరాట్ కోహ్లీ (Virat Kohli)కి రిషబ్ పంత్ (Rishabh Pant) తోడవ్వడంతో భారత్ కోలుకుంది. మూడోరోజు లంచ్ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లీ (28), పంత్ (51) క్రీజులో ఉన్నారు. 


Also Read: Chiranjeevi Jagan meet : జగన్‌తో చిరంజీవి భేటీ వర్క్‌ అవుట్‌, 10 రోజుల్లో గుడ్ న్యూస్, కొత్త జీవో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి