IND vs SA: Prithvi Shaw says I am fully Disappointed not getting a chance in Indian Team: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై భారత యువ ఓపెనర్‌ పృథ్వీ షా అసహనం వ్యక్తం చేశాడు. దేశవాలీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నప్పటికీ భారత జట్టులో అవకాశాలు మాత్రం రావట్లేదని ఆవేదన చెందాడు. ప్రస్తుతానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా అని పృథ్వీ షా చెప్పాడు. ప్రస్తుతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2022కి సిద్ధమవుతున్న షా.. తాజాగా మిడ్‌ డేతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు విషయాలపై స్పందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు నన్ను ఎంపిక చేయకపోవడంతో చాలా నిరాశపడ్డా. నేను దేశవాలీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నా. చాలా కష్టపడుతున్నా. అయినా భారత జట్టులో అవకాశాలు రావట్లేదు. జాతీయ జట్టుకు నేను సిద్ధంగా ఉన్నానని బీసీసీఐ సెలెక్టర్లు ఎప్పుడు భావిస్తారో.. అప్పుడే నన్ను ఆడిస్తారు. ప్రస్తుతానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. భారత్, భారత్-ఎ, ఇంకే జట్టయినా నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తున్నా. ఇక నా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకుంటున్నా' అని పృథ్వీ షా తెలిపాడు. 


దేశవాళీ క్రికెట్‌లో ఫామ్‌లో ఉండి పరుగులు చేస్తున్న పృథ్వీ షాకు కొంతకాలంగా టీమిండియాలో చోటు దక్కడం లేదు. ఇటీవల న్యూజిలాండ్‌ ఎ, భారత్‌ ఎ మధ్య జరిగిన సిరీస్‌లో చెలరేగాడు. అంతకుముందు జరిగిన దులీప్‌ ట్రోఫీలో రెండు సెంచరీలు బాదాడు. దీంతో స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికవుతానని షా అనుకున్నాడు. అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇచ్చారు. 2021 జులైలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో పృథ్వీ షా చివరిసారిగా భారత జట్టులో ఆడాడు.  


Also Read: Samantha Ruth Prabhu : వెనక్కి తగ్గా ఓడిపోలేదు.. సమంత పోస్ట్


Also Read: Rahul Ramakrishna Wife : సీక్రెట్‌గా పెళ్లి.. రాహుల్ రామకృష్ణ భార్య పిక్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook