Rahul Ramakrishna Wife : ఆమె నా లెక్క కాదు!.. పెళ్లాన్ని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna Wife Haritha రాహుల్ రామకృష్ణ తాజాగా తన భార్య గురించి చెప్పుకొచ్చాడు. దీంతో అందరికీ ఓ అనుమానం వచ్చింది. అసలు రాహుల్ రామకృష్ణకు పెళ్లి ఎప్పుడు జరిగింది? ఇదంతా ఎక్కడ జరిగింది? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 11:01 AM IST
  • నెట్టింట్లో కమెడియన్ పోస్ట్ వైరల్
  • రాహుల్ రామకృష్ణకు పెళ్లైందా?
  • భార్యను పరిచయం చేసిన నటుడు
Rahul Ramakrishna Wife : ఆమె నా లెక్క కాదు!.. పెళ్లాన్ని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna Wife Haritha : రాహుల్ రామకృష్ణ కమెడియన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రాహుల్ క్రేజ్ మారిపోయింది. శివలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలనేంతగా నటించేశాడు రాహుల్. అర్జున్ రెడ్డి సినిమాకు శివ కారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. ఆ కారెక్టర్‌ను రాహుల్ అద్భుతంగా పోషించాడు. అలా రాహుల్ రామకృష్ణకు మంచి డిమాండ్ ఏర్పడంది. కమెడియన్, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాహుల్ రామకృష్ణకు మంచి డిమాండ్ ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ చాన్స్ కొట్టేశాడు. తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. ఇక జాతి రత్నాలు సినిమాతో మరోసారి అందరినీ పగలబడి నవ్వించేశాడు. అయితే తెరపై  రాహుల్ అందరినీ నవ్విస్తుంటాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ ఎవ్వరికీ అంతగా అంతు పట్టడు. ఒక్కోసారి ఆయన వేసే తిక్క ట్వీట్లు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. రాహుల్ పర్సనల్ లైఫ్, అందులోని ట్విస్టులు, లవ్ స్టోరీలు, బ్రేకప్‌లు ఇలా వైరల్ అవుతుంటాయి. ముందు బిందు అనే అమ్మాయితో రాహుల్ పీకల్లోతు ప్రేమలో మునిగాడు. అయితే అది పెళ్లి వరకు రాలేదు. మధ్యలోనే బ్రేకప్ అయింది. ఆ తరువాత మళ్లీ మూడేళ్లకు రాహుల్ ప్రేమలో పడ్డాడు.

 

హరిత అనే అమ్మాయిని తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నట్టుగా రాహుల్ ప్రకటించాడు.  ఈ మేరకు ఈ ఏడాది మేలో ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా రాహుల్ వేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. మీట్ మై వైఫ్ అంటూ తన భార్య ఫోటోను షేర్ చేశాడు. ఆమె వెజిటేరియన్.. నా లెక్క కాదు. కానీ నా కోసం మాత్రం మంచి పాయను యూట్యూబ్ వీడియోల ద్వారా  చూసి చేస్తుంది.. అంటూ తన భార్య గురించి గొప్పగా చెప్పేసుకున్నాడు రాహుల్. అయితే రాహుల్ వేసిన పోస్ట్ చూసి నీకు ఎప్పుడు పెళ్లి అయింది అన్నా.. ఆల్ ది బెస్ట.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు.

Also Read : Khushbu sundar : ఆస్పత్రి బెడ్డుపై కుష్బూ..

Also Read : Godfather Collections: గాడ్ ఫాదర్ సినిమా జోరు.. మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News