Rishabh Pant: అందుకే ఓడిపోయాం.. ఇక మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే: పంత్
Rishabh Pant not happy with spinners show in IND vs SA 2nd T20I. రెండో టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఓటమికి గల కారణాలను కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు.
Rishabh Pant not happy with spinners performance in IND vs SA 2nd T20I: కటక్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40; 35 బంతుల్లో 2×4, 2×6) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (81; 46 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భువనేశ్వర్ కుమార్ (4/13) అద్భుతంగా బౌలింగ్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా ఓటమికి గల కారణాలను కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. 'మేము మరో 10-15 పరుగులు చేయాల్సింది. మొదటి 7-8 ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ సహా మిగతా ఫాస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత మేము రాణించలేకపోయాం. సెకండాఫ్‌లో వికెట్లు తీయాల్సిన అవసరం ఉన్నా.. అది చేయలేకపోయాము. స్పిన్నర్లు అంతగా రాణించలేదు. క్లాసెన్, బవుమా బాగా బ్యాటింగ్ చేశారు. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది' అని అన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గైర్హాజరీలోని భారత యువ జట్టుపై దక్షిణాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన ప్రొటీస్.. కటక్‌లో జరిగిన రెండో టీ20లోనూ అద్భుత విజయం సాధించింది. తాజా విజయంతో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్ మంగళవారం విశాఖపట్నంలో జరుగుతుంది.
Also Read: Nora Fatehi: హాలీవుడ్ డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్న నోరా ఫతేహీ, అస్సలు గుర్తుపట్టలేరు మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.