India hammer Sri Lanka by an innings and 222 runs: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీసులో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో రోజైన ఆదివారం ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. 178 పరుగులకు ఆలౌటౌంది. నిరోషన్ డిక్వెల్లా (51) ఒక్కడే పర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్యాట్, బంతితో సత్తాచాటిన జడేజాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో కెరీర్‌లో 100 టెస్ట్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్టే అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 574/8 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. రవీంద్ర జడేజా (175 నాటౌట్‌; 228 బంతుల్లో 17×4,3×6) సెంచరీ చేయగా.. రిషబ్ పంత్‌ (96; 97 బంతుల్లో 9×4,4×6), హనుమ విహారి (58; 128 బంతుల్లో 5×4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (61; 82 బంతుల్లో 8×4) అర్ధ శతకాలు చేశారు. టాప్ ఆర్డర్ విఫలమయిన చోట జడేజా అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అశ్విన్‌తో 130 పరుగులు, మహమ్మద్ షమీతో 103 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు.


అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 పరుగులకు ఆలౌట్ అయింది. 108/4తో మూడో రోజైన ఆదివారం ఆట ప్రారంభించిన శ్రీలంకకు ఓవర్‌నైట్‌ బ్యాటర్లు అసలంక (29), నిసాంక (61) మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 58 పరుగుల భాగస్వామ్యం అందించారు. అసలంక పెవిలియన్‌కు చేరడంతో లంక వరుసగా వికెట్లు కోల్పోయింది. 161/5తో మంచి స్థితిలో ఉన్న లంక.. 13 పరుగుల వ్యవధిలో మిగతా 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఆర్ జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. ఆర్ అశ్విన్‌ 2, జస్ప్రీత్ బుమ్రా 2 తలో రెండు తీశారు.



400 పరుగుల లోటుతో ఫాలోఆన్‌ (రెండో ఇన్నింగ్స్‌) ఆడిన శ్రీలంకను భారత బౌలర్లు ఆటాడుకున్నారు. జడేజా, అశ్విన్‌ తమ స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ లంక 178 పరుగులకే ఆలౌట్ అయింది. డిక్వెల్లా (51) ఫర్వాలేదినిపించగా.. ధనంజయ డిసిల్వా 30, మాథ్యూస్ 28, కరుణరత్నె 27, అసలంక 20 రెండంకెల స్కోర్ అందుకున్నారు. ఇన్నింగ్స్ చివరలో డిక్వెల్లా, ఎంబుల్దేనియా ప్రతిఘటించారు కాబట్టి ఆ మాత్రం స్కోర్ అయినా లంక చేసింది. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 4, షమీ 2 వికెట్లు పడగొట్టారు.


Also Read: Radhe Shyam First Review: రాధేశ్యామ్‌ రివ్యూ.. భారత్‌లో ప్రభాస్‌ను బీట్‌ చేసేవాళ్లే లేరు!!


Also Read: Trivikram Remuneration: త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 'సూపర్ స్టార్' మహేష్ బాబుకు పోటీగా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook