Virat Kohli 100th Test: బెంగళూరులో కాదు.. విరాట్ కోహ్లీ వందో టెస్ట్ ఆడేది ఎక్కడో తెలుసా?
Virat Kohli 100th Test: శ్రీలంక పర్యటనకు సంబందించి సవరించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన100వ టెస్టు మ్యాచ్ బెంగళూరులో కాకుండా.. మొహాలిలో ఆడనున్నాడు.
Virat Kohli will play his 100th Test in Mohali: సొంతగడ్డపై శ్రీలంక పర్యటనకు సంబందించి సవరించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా ఇరు జట్ల మధ్య తొలుత టెస్ట్ సిరీస్ కాకుండా.. టీ20 సిరీస్ జరగనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం మార్చి 4 నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం అవుతుంది.
శ్రీలంక బోర్డు విజ్ఞప్తి మేరకు భారత పర్యటనలో బీసీసీఐ మార్పులు చేసింది. 'భారత్, శ్రీలంక జట్ల మధ్య ముందుగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఉంటుంది' అని మంగళవారం బీసీసీఐ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 24న జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు లక్నో ఆతిథ్యమిస్తుంది. ఫిబ్రవరి 26, 27వ తేదీల్లో జరిగే రెండు, మూడో టీ20లకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతి ఉందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.
రెండు టెస్టు మ్యాచులకు మొహాలి, బెంగళూరు ఆతిథ్యమిస్తాయని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఆ వార్తలను ధ్రువీకరించింది. మొదటి టెస్టు మార్చి 4న మొహాలీలో ఆరంభం అవుతుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు. కోహ్లీకి ప్రత్యేక అనుబంధం ఉన్న బెంగళూరులో నిర్వహిస్తామని గతంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించినా.. అది జరగలేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మొహాలిలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైంది. రెండో టెస్టు (డే/నైట్) మార్చి 12న బెంగళూరులో ఆరంభం కానుంది.
విరాట్ కోహ్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు ఇది జీర్ణించుకోలేని వార్త అని చెప్పాలి. ఐపీఎల్ ప్రాంచైజీ ఆర్సీబీ కారణంగా కోహ్లీకి బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక కెరీర్‌లో ఇప్పటివరకు కోహ్లీ 99 మ్యాచులు ఆడి 50.4 యావరేజ్, 55.7 స్ట్రైక్ రేట్‌తో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 254 నాటౌట్.
Also Raed: IND vs WI: విరాట్ కోహ్లీని అలా వదిలేయండి.. రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Raed: Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సంచలన కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook