Ind Vs SL 2nd Odi Highlights: కొత్త ఏడాదిలో తొలి వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించాడు. తన వన్డే కెరీర్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శానక ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది. చైనామన్ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ తన మాయాజాలంతో లంకేయులను బోల్తా కొట్టించాడు. సిరాజ్ తన పదునైన పేస్‌తో చెలరేగాడు. దీంతో లంక బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. అరంగేట్ర బ్యాట్స్‌మెన్ నువనిదు ఫెర్నాండో (50) ఒక్కడే రాణించగా మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం చేతులేత్తాశారు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.


216 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ను శ్రీలంక బౌలర్లు బాగా ఇబ్బంది పెట్టారు. తొలి వన్డేలో అదరొట్టిన ఓపెనర్లు ఈసారి విఫలమయ్యారు. రోహిత్‌ (17), శుభ్‌మన్‌ గిల్‌ (21) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు వెళ్లిపోయారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లీ (4) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు చక్కని షాట్లతో అలరించిన శ్రేయస్ అయ్యర్ (28)ను కూడా ఔట్ చేసి లంక రేసులోకి వచ్చింది. అప్పటికీ భారత్ స్కోరు 86/4. ఈ దశలో మరో వికెట్ పడి ఉంటే టీమిండియా కష్టాలు రెట్టింపయ్యేవి.


కానీ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు క్రీజ్‌లో పాతుకుపోయి.. సింగిల్స్‌తో స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించారు. కావాల్సినన్ని బంతులు ఉండడంతో తొందరపడకుండా.. స్టైక్‌రొటేట్ ఇన్నింగ్స్ నడిపించారు. ఇద్దరు ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించగా.. హార్ధిక్ (36)ను ఔట్ చేసి లంక ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత ఎటాకింగ్ బౌలింగ్ ప్రయత్నించినా.. కేఎల్ రాహుల్ ఏ మాత్రం బెదరలేదు. అక్షర్‌ పటేల్‌ (21), కుల్దీప్ యాదవ్‌‌ (10 నాటౌట్‌)తో కలిసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. 103 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి