IND VS SL 2nd Test : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు!
IND VS SL 2nd Test : బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకోనున్నాడు.
IND VS SL 2nd Test : శ్రీలంకతో భారత్ రెండో టెస్టు (IND VS SL 2nd Test) మార్చి 12న ప్రారంభకానుంది. ఇప్పటికే మెుదటి టెస్టు గెలుచుకున్నా టీమిండియా (Teamindia) మాంచి ఊపు మీద ఉంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో అరుదైన రికార్డును అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో 400 మ్యాచ్ ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ ఘనత సాధించనున్న 35వ అంతర్జాతీయ క్రికెటర్‌గా, 9వ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.
ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో మెుదటి స్థానంలో ఉన్నాడు. లంక మాజీ ఆటగాళ్లు మహేల జయవర్థనే (652), సంగక్కర (594), జయసూర్య (586) వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా తరఫున సచిన్ తర్వాత ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లి (457), మహ్మద్ అజహారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402)లు... రోహిత్ (399) కంటే ముందున్నారు.
2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు రోహిత్. తన 15 ఏళ్ల కెరీర్‌లో 44 టెస్ట్ మ్యాచ్‌లు, 230 వన్డేలు, 125 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో 41 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీల సాయంతో 15672 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు (125), అత్యధిక పరుగులు (3313) చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ కొనసాగుతున్నాడు. రెండో టెస్టుకు ముందు భారత్ జట్టులో స్వల్పమార్పులు చోటుచోసుకున్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులోకి వచ్చాడు.
Also Read: IND vs SL 2nd Test: భారత జట్టులో స్వల్పమార్పులు.. కుల్దీప్ స్థానంలో అక్షర్ పటేల్‌కి చోటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook