Ind vs SL 3rd Odi Live Updates: శ్రీలంకపై మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ ఉవ్విల్లూరుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఓడించేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ వన్డేలో విజయం సాధించి.. క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలని శ్రీలంక చూస్తోంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌ స్థానంలో వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మంచి పిచ్‌గా కనిపిస్తోంది. దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మేం ఇంకా కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ఈ రోజు పర్ఫెక్ట్‌ గేమ్ ఆడాలని అనుకుంటున్నాం. హార్దిక్, ఉమ్రాన్‌లకు విశ్రాంతి లభించగా.. వాషింగ్టన్, సూర్యకుమార్ తుది జట్టులోకి వచ్చారు..' కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


'ఇక్కడి వాతావరణం శ్రీలంకను పోలి ఉంటుంది. మేం ప్రారంభంలో బాగానే ఉన్నాం. కానీ ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అది మెరుగుపరచుకోవాల్సి ఉంది. జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. అషెన్ బండార, జెఫ్రీ వాండర్సేను జట్టులోకి తీసుకున్నాం.' అని శ్రీలంక కెప్టెన్ దసున్ శానక తెలిపాడు.


తుది జట్టు ఇలా..


భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్


శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ శానక (కెప్టెన్), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార 


Also Read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి