IND vs SL: చహల్ వద్దు.. అతడేనే తుది జట్టులో ఆడించండి! శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు గంభీర్ సలహా
Asia Cup 2022, Gautam Gambhir about India Playing 11 vs Sri Lanka. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో పేసర్ అవేశ్ ఖాన్‌ను శ్రీలంకతో జరిగే మ్యాచుకు తుది జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సలహా ఇచ్చారు
Asia Cup 2022, Gautam Gambhir about India Playing 11 vs Sri Lanka: ఆసియా కప్ 2022 గ్రూప్ దశలో పాకిస్థాన్, హాంకాంగ్‌పై వరుస విజయాలతో సూపర్ 4లోకి అడుగుపెట్టిన భారత్.. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటోంది. సూపర్ 4లో పాకిస్తాన్ చేతిలో ఓటమి భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. టైటిల్ పోటీలో నిలవాలంటే.. సూపర్ 4లో మిగిలిన రెండు మ్యాచులలో రోహిత్ సేన తప్పక గెలవాల్సిందే. నేడు సూపర్ 4 రెండో మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రోహిత్ సేనకు చావోరేవో లాంటిది. శ్రీలంకతో డూ ఆర్‌డై మ్యాచ్‌కు భారత జట్టులో మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించారు.
ఇటీవల విఫలమవుతున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో పేసర్ అవేశ్ ఖాన్‌ను శ్రీలంకతో జరిగే మ్యాచుకు తుది జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సలహా ఇచ్చారు. స్టార్ స్పోర్ట్స్‌లో గౌతీ మాట్లాడుతూ... 'యుజ్వేంద్ర చాహల్‌ను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. శ్రీలంకతో జరిగే డూ ఆర్‌డై మ్యాచ్‌కు యూజీ స్థానంలో అవేష్ ఖాన్‌కు తిరిగి జట్టులోకి తీసుకురావాలి. చాహల్‌ను అవేష్ ఖాన్‌తో భర్తీ చేస్తే జట్టు పటిష్టంగా ఉంటుంది' అని అన్నారు.
'యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలి. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో యుజ్వేంద్ర చహల్ అంతగా రాణించలేకపోయాడు. కాబట్టి లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్‌కు మరిన్ని అవకాశాలు కల్పించే సమయం వచ్చింది' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ తన నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్లు పడగొట్టాడు.
యుజ్వేంద్ర చహల్ తన నాలుగు ఓవర్లలో ఏకంగా 43 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. కీలక సమయంలో ఎక్కువగా బౌండరీలు ఇచ్చి పాక్ బ్యాటర్ల పని సులువు చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ ఆడలేదు. అయితే అవేష్, చహల్ ఇద్దరూ ఆగస్టు 28న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఆడారు. అవేష్ రెండు ఓవర్లలో ఒక వికెట్ తీసి19 పరుగులు ఇవ్వగా.. చహల్ నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. హాంకాంగ్‌తో జరిగిన రెండో గేమ్‌లో చహల్ తన నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. అవేష్ తన నాలుగు ఓవర్ల కోటాలో 53 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read: పులితో 25 నిమిషాలు పోరాడి.. కుమారుడి ప్రాణాలను రక్షించుకున్న తల్లి! ప్రేమంటే ఇదే మరి
Also Read: Rahul Gandhi: రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ.. రూ.500లకే ఎల్పీజీ సిలిండర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook