Rahul Gandhi promised loan waiver of up to Rs 3 lakh to farmers and LPG cylinder at Rs 500 in Gujarat: గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లో అధికారం కోసం ఇప్పటినుంచే అన్ని పార్టీలు కన్నేశాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించి.. ఆ పీఠాన్ని అధిష్టించాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సోమవారం అహ్మదాబాద్‌లో జరిగిన ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో పాల్గొన్న రాహుల్.. ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లో రూ.3 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయడంతో పాటు ఎల్పీజీ సిలిండర్‌ను రూ.500లకే అందిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్తు, సాధారణ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, బాలికలకు ఉచిత విద్య అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1000పైగా ఉన్న విషయం తెలిసిందే.
గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. అంతేకాదు మూడు వేల ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేస్తుందని, రైతుల రుణాలు మాఫీ చేశామని మీరు ఎప్పుడైనా విన్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. కేవలం ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తలకు బీజేపీ కొమ్ముకాస్తోందన్నారు. గుజరాత్ అంటే ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల పాలన మాత్రమేనని రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: రెచ్చిపోయిన స్టార్ హీరోల అభిమానులు.. రాయలేని విధంగా ట్రోలింగ్
Also Read: iBOMMA Close: సినీ ప్రియులకు బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా ఐబొమ్మ సేవలు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook