India vs Sri Lanka Today Match Dream11 Tips and Playing11: శ్రీలంకపై టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి ఊపు మీద ఉన్న భారత్.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. టీ20 ప్రపంచకప్ తరువాత రెస్ట్ తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి రానున్నారు. వన్డే వరల్డ్ కప్ తరువాత శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. స్టార్ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండడంతో తుది జట్టు ఎంపిక సంక్షిష్టంగా మారింది. వికెట్ కీపర్‌గా పంత్, రాహుల్‌లో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఆరోస్థానంలో రియాన్ పరాగ్, శివమ్ దూబే మధ్య పోటీ నెలకొంది. కొలంబోలోని ఖెట్టారామాలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 


పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. ఆర్.ప్రేమదాస స్టేడియంలోని పిచ్ బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ పిచ్‌పై పేసర్ల కంటే స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. 156 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 99 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా టీమిండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. టీ20 సిరీస్‌ కోల్పోయిన శ్రీలంక.. వన్డే సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తోంది.


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, రిషబ్ పంత్‌/కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్‌ దూబె/రియాన్‌ పరాగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్‌ అహ్మద్‌, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ సిరాజ్‌


శ్రీలంక: పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, జనిత్ లియానగే, దిల్షాన్ మధుశంక, వానిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ


IND Vs SL Dream11 Tips: 


వికెట్ కీపర్: లోకేష్ రాహుల్, కుశాల్ మెండిస్ 
బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ 
ఆల్‌రౌండర్లు: వనిందు హసరంగా, అక్షర్ పటేల్ 
బౌలర్లు: కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మతీషా పతిరణ.


Also Read: Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.