IND vs SL Free Live Streaming: భారత్ vs శ్రీలంక మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు.. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లో మాత్రం కాదు!
India vs Sri Lanka Asia Cup 2022 Super Four Free Live Streaming. డీడీ స్పోర్ట్స్ ఛానల్ భారత్, శ్రీలంక మ్యాచ్‌ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
India vs Sri Lanka Asia Cup 2022 Super Four live streaming on DD Sports for Free: ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్.. నేడు డూ ఆర్‌డై మ్యాచ్ ఆడుతోంది. మంగళవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, శ్రీలంక జట్లు తలపడడం ఇదే మొదటిసారి. గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు సాధించి మంచి ఊపులో ఉండగా.. పాక్ చేతిలో ఓడిన భారత్ ఆత్మవిశ్వాసం కోల్పోయింది. అయితే అన్ని రకాలుగా లంకపై భారత్‌దే పైచేయిగా ఉండడం కలిసొచ్చే అంశం.
భారత్, శ్రీలంక మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 7:30గంటలకు ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం అయితే.. ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ పెయిడ్ ఛానల్ కాగా.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు సబ్ స్క్రిప్షన్ అవసరం. అయితే ఈ మ్యాచ్‌ను ఉచితంగా కూడా చూడొచ్చు. డీడీ స్పోర్ట్స్ ఛానల్ భారత్, శ్రీలంక మ్యాచ్‌ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
డీడీ స్పోర్ట్స్ ఛానల్‌కు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. ఆసియా కప్ 2022 సూపర్ 4 దశలో భారత్ ఆడే మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను గత ఆదివారం డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో పాటు 8న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను కూడా డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఆసియా కప్ టోర్నీలో భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు (వన్డే, టీ20) 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచులు గెలవగా.. శ్రీలంక కూడా 10 మ్యాచ్‌లు గెలిచింది. ఇక భారత్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు జరగగా.. అందులో భారత్ 17 మ్యాచ్‌లలో గెలుపొందింది. శ్రీలంక 7 విజయాలు అందుకోగా.. ఒక మ్యాచ్ టై అయింది.
Also Read: చహల్ వద్దు.. అతడేనే తుది జట్టులో ఆడించండి! శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు గంభీర్ సలహా
Also Read: పులితో 25 నిమిషాలు పోరాడి.. కుమారుడి ప్రాణాలను రక్షించుకున్న తల్లి! ప్రేమంటే ఇదే మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook