Kuldeep Yadav: తుది జట్టు కూర్పు చాలా ముఖ్యం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కుల్దీప్ యాదవ్
IND vs SL, The composition of the final team is very important says Kuldeep Yadav. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అనంతరం భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
Kuldeep Yadav says Iam satisfying with my bowling in India vs Sri Lanka 2nd ODI: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై పోరాడి రోహిత్ సేన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకొంది. చివరిదైన మూడో వన్డే ఆదివారం (జనవరి 14) తిరువనంతపురం వేదికగా జరగనుంది. రెండో వన్డేలో శ్రీలంకను కట్టడి చేయడంలో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 10 ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 51 పరుగులు ఇచ్చాడు.
భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనకను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. దాంతో లంక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. 'నా ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. నాకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా. తుది జట్టులో ఉన్నప్పుడు లక్ష్యంపైనే దృష్టిసారించాలి. బెంచ్‌పై ఉన్నప్పుడు రిలాక్స్ అవొచ్చు. తుది జట్టు కూర్పు చాలా ముఖ్యం. అందులో భాగంగా ఒక్కోసారి చోటు దక్కదు. అలాంటప్పుడు నేను పెద్దగా ఆలోచించను. అవకాశం వచ్చినప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా' అని కుల్దీప్ చెప్పాడు.
'ఎప్పుడూ ఒకే పేస్‌తో బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు కొత్తదనంతో బంతిని సంధిస్తూ ఉండాలి. అప్పుడే బ్యాటర్లను కట్టడి చేయగలం. నేను జట్టులో లేని గత ఏడాది మొత్తం ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టా. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్‌ల సాయంతో ఫిట్‌నెస్ సాధించా. ఇది దూకుడుగా ఉండేందుకు సాయపడుతుంది. యుజ్వేంద్ర చహల్ నాకు చాలా మద్దతుగా నిలిచాడు. నా బ్యాటింగ్‌పైనా కసరత్తు చేశా' అని కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు.
Also Read: Maruti New SUV: హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లకు పోటీగా.. మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్‌యూవీ!
Also Read: KL Rahul: బంతి అలా వస్తుంటే.. ఆడటం నాకు చాలా ఇష్టం: కేఎల్ రాహుల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.