Maruti New SUV: హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లకు పోటీగా.. మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్‌యూవీ!

Maruti New SUV, Maruti Suzuki Fronx Car compete with Hyundai, Tata Nexon.  మారుతి హ్యుందాయ్ క్రెటా మరియు టాటా నెక్సాన్ కార్లకు పోటీగా మారుతి సుజుకి కొత్త కారును తీసుకొచ్చింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 13, 2023, 02:05 PM IST
  • హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లకు పోటీ
  • మారుతీ సుజుకీ నుంచి కొత్త యూవీ
  • కూపే లాంటి రూఫ్‌లైన్
Maruti New SUV: హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లకు పోటీగా.. మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్‌యూవీ!

Maruti Suzuki Fronx Car compete with Hyundai Creta and Tata Nexon: మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 'హ్యుందాయ్ క్రెటా' మరియు సబ్ 4 మీటర్ల ఎస్​యూవీ సెగ్మెంట్‌లో 'టాటా నెక్సాన్' అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 'మారుతీ సుజుకి' కంపెనీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది. అందుకే ఇటీవల మారుతి సుజుకి గ్రాండ్ విటారాను మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విడుదల చేసింది. హ్యుందాయ్ క్రెటాకు ఇది గట్టి పోటీ ఇస్తోంది. అంతేకాకుండా నెక్సాన్‌కు పోటీగా సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి కంపెనీ ఇప్పటికే బ్రెజాను విక్రయిస్తోంది. బ్రెజా కారు చాలా నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్​యూవీ కారుగా నిలుస్తోంది.

మారుతి హ్యుందాయ్ క్రెటా మరియు టాటా నెక్సాన్ కార్లకు మారుతి సుజుకి బ్రెజా పోటీని ఇస్తోంది. ఇప్పుడు దాని పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ.. మారుతి సుజుకి ఒక కొత్త ఎస్‌యూవీ (మారుతీ సుజుకి ఫ్రాంక్స్) తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ (Maruti Suzuki Fronx) మారుతి సుజుకి అమ్మకాలను ప్రభావితం చేస్తుంది. ఈ కార్ కూపే స్టైల్ ఫ్రాంక్స్ ఎస్‌యూవీ. దీని డిజైన్ మరియు స్టైలింగ్.. కొత్త గ్రాండ్ విటారా మరియు బాలెనో మాదిరిగా ఉంటుంది. ఇది కూపే లాంటి రూఫ్‌లైన్ మరియు వెనుక గ్లాస్ వంగి ఉంటుంది.

కొత్త మారుతి ఫ్రాంక్స్ కారు 1.0లీటర్ బూస్టర్‌జెట్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.2లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది టర్బో ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 102bhp గరిష్ట శక్తిని మరియు 150Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారుతో రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి (5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్). అయితే ఇందులో AllGrip AWD టెక్నాలజీని అందించడం లేదు.

కొత్త కారు ఫ్రాంక్స్.. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిసి ఉంటుంది. కారులో సుజుకి కనెక్ట్ మరియు వాయిస్ కమాండ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ కారులో 360-డిగ్రీ కెమెరా, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ ఎసి యూనిట్, రియర్ ఎసి వెంట్లు, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు 3-పాయింట్ ఇఎల్‌ఆర్ ఉన్నాయి. సీటు బెల్టులు లాంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 

Also Read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే

Also Read: Best Selling SUV: అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 3 ఎస్‌యూవీ కార్లు ఇవే.. హ్యుందాయ్ క్రెటా మాత్రం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News