India Won The Toss Chose to Bat First Against Sri Lanka: ఆసియా కప్‌లో నేడు మరో కీలక సమరం జరుగుతోంది. సూపర్‌-4లో భారత్, శ్రీలంక జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌ శ్రీలంకకు చెక్ పెట్టాలని భారత్ చూస్తోంది. సూపర్‌-4 పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి శ్రీలంక ఉత్సాహంలో ఉన్నాయి. సొంతగడ్డపై బలంగా కనిపిస్తున్న శ్రీలంక.. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరిస్తుందో లేదో చూడాలి. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. 'పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన అయ్యర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడికి వైద్య బృందం కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. శ్రీలంకతో జరిగే మ్యాచ్ కోసం అయ్యర్ భారత జట్టుతో కలిసి స్టేడియంకు రాలేదు' అని ట్వీట్ చేసింది.


"మేము బ్యాట్ చేయబోతున్నాం. అది ఒక ఆటగాడిగా, జట్టుగా భిన్నమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాం. చివరి మ్యాచ్‌లో మేము బాగా బ్యాటింగ్ చేశాం. మంచి బౌలింగ్‌తో ఛేజింగ్‌లో పాక్‌ను నిలువరించారు. కానీ మళ్లీ ఇది కొత్తగా ఆరంభించాలి. ఇది తాజా గేమ్. పిచ్ భిన్నంగా కనిపిస్తుంది. చాలా పొడిగా ఉంది. శార్దూల్ ఠాకుర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నాం. ఇది స్పిన్నర్లకు సహాయపడవచ్చు. ముగ్గురు నాణ్యమైన పేసర్లు కూడా ఉన్నారు.." అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


"టాస్ గెలిచి ఉంటే మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. మా పోలిస్తే భారత్ చాలా బలమైన టీమ్. కానీ మేం మంచి గేమ్ ఆడాలి. మేము ఎలాగైనా మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం. టీమ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతున్నాం.." అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక చెప్పాడు.


ప్లేయింగ్ 11 ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.


Also Read: Numerology Number Predictions Today: ఈ నంబరు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.. మీ దశ తిరిగినట్లే..!  


Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!     


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook