Mohammed Shami World Cup Wickets: ముంబై ఐకానిక్ వాంఖడే స్టేడియంలో టీమిండియా అదరగొట్టింది. శ్రీలంకను 302 పరుగుల తేడాతో ఓడించి.. సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో పేసర్ మహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బంతి చేతికి ఇవ్వడమే ఆలస్యం.. తన తొలి ఓవర్‌ నుంచే వికెట్ల వేట ఆరంభించాడు. ఎన్నో రోజుల నుంచి కసి ఉన్నట్లు బుల్లెట్ల కంటే వేగంగా బంతులు సంధిస్తూ లంకేయులను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు (45) తీసిన టీమిండియా బౌలర్‌గా నిలిచిన షమీ.. జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్‌ (44) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో మూడే మ్యాచ్‌లు ఆడిన షమీ.. వరుసగా 5/54, 4/22, 5/18 గణంకాలు నమోదు చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు హెచ్చరికలు పంపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురవారం శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ పదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే శ్రీలంక 14 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు.. షమీ రాగానే వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీంతో 14 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. 30 పరుగులు కూడా చేస్తుందో లేదో అనిపించింది. చివరకు 55 పరుగుల వరకు లాక్కొచ్చిన లంకేయులు.. చివరకు చేతులేత్తేశారు.


ప్రపంచకప్ చరిత్రలో షమీకి ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన టాప్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్‌తో సమం చేశాడు. షమీ ప్రపంచ కప్ వికెట్ల సంఖ్య 45కి చేరుకుంది. షమీ కేవలం 14 మ్యాచ్‌ల్లోనే 45 వికెట్లు తీయగా.. జహీర్ ఖాన్ 23 మ్యాచ్‌ల్లో, జవగల్ శ్రీనాథ్ 34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశారు. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యా గాయపడడంతో షమీకి తుదిజట్టులో అవకాశం దక్కిన విషయం తెలిసిందే.


షమీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నా.. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాలేదు. షమీ పక్కనపెట్టడంపై అన్ని వైపులా నుంచి విమర్శలు వచ్చాయి. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ ఆడతాడని శార్దుల్ ఠాకూర్‌నే ఆడించింది మేనేజ్‌మెంట్. పాండ్యా గాయం తరువాత బౌలింగ్‌లో బలోపేతం కోసం షమీకి అవకాశం ఇచ్చింది. దీంతో వచ్చిన ఛాన్స్‌ను వినియోగించుకున్న షమీ.. అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగిపోతున్నాడు. తన ప్రదర్శనతోనే అందరికీ సమాధానం ఇచ్చాడు. షమీ బౌలింగ్‌కు వస్తేనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ల వణుకులే పుట్టించేలా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా తనను జట్టు నుంచి పక్కనబెడతారో చూస్తా.. అనే రీతిలో అదరగొట్టాడు. షమీ ఇదే జోరును కంటిన్యూ చేస్తే.. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలుస్తాడు. 


Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  


Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook