IND vs WI 1st T20I Preview and Playing 11: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఫిబ్రవరి 16) కోల్‌కతా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ సాయంత్రం 6.30 పడనుండగా.. మ్యాచ్ 7 గంటలకు ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపుమీదున్న భారత్.. పొట్టి సిరీసును కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తమకు అచొచ్చిన టీ20ల్లో అయినా టీమిండియాను ఓడించాలని విండీస్ చూస్తోంది. ఇక భారత జట్టులో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెగ్యులర్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో టీ20 సిరీస్‌కు దూరమవడంతో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. దాంతో మరో యువ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌కు నిరాశ తప్పదు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. ఆపై శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. శ్రేయస్‌, సూర్యలు వన్డేలలో అదరగొట్టడంతో వారిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ పంత్‌కు రెస్ట్ ఇవ్వాలనుకుంటే.. రుతురాజ్‌కు అవకాశం దక్కుతుంది. ఇక వెంకటేష్ అయ్యర్‌కు కూడా నిరాశ తప్పకపోవచ్చు.


టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. ప్రస్తుతం యూజీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కారణంగా వాషింగ్టన్‌ సుందర్‌ టీ20 సిరీస్‌కు దూరమవడంతో మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కుల్దీప్ బదులుగా అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లదు. పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్ ఖాయం కాగా.. మూడో పేసర్ రేసులో  శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్‌లు ఉన్నారు. అయితే ఆల్‌రౌండర్‌ అయిన ఠాకూర్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 


భారత తుది జట్టు ఇదే:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), దీపక్‌ చహర్‌, శార్దూల్ ఠాకూర్‌/హర్షల్ పటేల్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్ యాదవ్, మహమ్మద్‌ సిరాజ్‌.


డ్రీమ్ 11 టీమ్:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కైల్ మేయర్స్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్ (వైస్ కెప్టెన్), రొమారియో షెపర్డ్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, ఒడియన్ స్మిత్. 


Also Read: Bappi Lahiri Telugu Songs: చిరంజీవికి మంచి హిట్స్ ఇచ్చిన బప్పి లాహిరి.. తెలుగు టాప్ సాంగ్స్ ఇవే!!


Also Read: IPL 2022 Auction: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్వాగతం పలికిన షారుక్ ఖాన్.. సల్మాన్, సైఫ్, సంజయ్ కూడా (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook